కండలు తిరిగిన దేహంతో బ్రూస్లీలా కనిపిస్తోన్న ఈ హీరోను గుర్తుపట్టారా? యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
పై ఫొటోలో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నది ఎవరో గుర్తుపట్టారా? అతను సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఫేమస్ హీరో. పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు, తమిళ్‌సినిమాల్లోనే ఎక్కువగా నటించాడు. వందలాదికి పైగా సినిమాల్లో నటించిన ఈ హీరో డైరెక్టర్‌గానూ సత్తా చాటాడు.
పై ఫొటోలో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నది ఎవరో గుర్తుపట్టారా? అతను సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఫేమస్ హీరో. పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు, తమిళ్‌సినిమాల్లోనే ఎక్కువగా నటించాడు. వందలాదికి పైగా సినిమాల్లో నటించిన ఈ హీరో డైరెక్టర్‌గానూ సత్తా చాటాడు. ఇక యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు తెలుగు నాట కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. కేవలం హీరోగానే కాదండోయ్ కొన్ని సినిమాల్లో విలన్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం స్పెషల్ రోల్స్‌తో సందడి చేస్తూనే డైరెక్టర్‌గా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవలే ఓ యంగ్ హీరోతో సినిమా మొదలెట్టాడు. అయితే అతను మధ్యలోనే తప్పుకోవడంతో బాగా అప్సెట్ అయ్యాడీ హీరో. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? యస్ .. అతను మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
సినిమాలతో బిజీగా ఉండే అర్జున్ 2017లో మొదటిసారిగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ పోస్టుగా పై ఫొటోను షేర్ చేశాడు. అందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు అర్జున్. చూస్తుంటే ఈ ఫొటో టీనేజ్‌లోనిది అనిపిస్తోంది. ఇటీవలే విశ్వక్‌సేన్‌తో ఓ సినిమాను మొదలెట్టాడు అర్జున్. అయితే ఎందుకోగానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడీ యాక్షన్ హీరో. ప్రస్తుతం విజయ్ ‘లియో’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అర్జున్. దీంతో పాటు పలు తెలుగు, తమిళ్, మలయాళ ప్రాజెక్టులకు ఓకే చెప్పారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.