Gukesh D: గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా.. నెట్ వర్త్ ఎంతకు పెరిగిందంటే?
D Gukesh TamilNadu CM MK Stalin: అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి.గుకేష్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.5 కోట్ల నగదును ప్రకటించారు. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
డి గుకేశ్ గురువారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా అతను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులో, చెస్‌లో ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి యువ ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. అత్యంత పిన్న వయస్కుడైన ఈ ప్రపంచ ఛాంపియన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
నగదు బహుమతిని ప్రకటించిన స్టాలిన్..
గుకేష్ చారిత్రాత్మక విజయం దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులోనూ ప్రకాశిస్తూ కొత్త శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. అలాగే, ఈ యంగ్ స్టార్‌కు అన్నివిధాల అండగా నిలుస్తామని డీఎంకే యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ ఉదయ్ స్టాలిన్ తెలిపాడు.
డి గుకేష్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడంటే?
To honour the monumental achievement of @DGukesh, the youngest-ever World Chess Champion, I am delighted to announce a cash prize of ₹5 crore!
His historic victory has brought immense pride and joy to the nation. May he continue to shine and achieve greater heights in the… pic.twitter.com/3h5jzFr8gD
— M.K.Stalin (@mkstalin) December 13, 2024
2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మొత్తం ప్రైజ్ మనీ $2.5 మిలియన్లు. ప్రపంచ చెస్ సమాఖ్య (FIDE) నిబంధనల ప్రకారం, ఒక్కో విజయం కోసం ఆటగాడికి $ 2 లక్షలు (దాదాపు రూ. 1.68 కోట్లు) ఇవ్వనున్నారు. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచుతారు. గుకేశ్ మూడు గేమ్‌లు (గేమ్‌లు 3, 11, 14) గెలిచాడు. ఈ విజయాల ద్వారానే $6 లక్షల (సుమారు రూ. 5.04 కోట్లు) సంపాదించాడు. అయితే, డింగ్ 1, 12 గేమ్‌లను గెలుచుకోవడం ద్వారా $4 లక్షల (రూ. 3.36 కోట్లు) సంపాదించాడు. మిగిలిన $1.5 మిలియన్లను ఇద్దరు ఆటగాళ్ల మధ్య సమానంగా విభజించారు. ఓవరాల్‌గా గుకేశ్ 1.35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.34 కోట్లు) గెలుచుకున్నాడు.
గుకేష్ ఎలా గెలిచాడు..
13 గేమ్‌ల తర్వాత మ్యాచ్ 6.5-6.5తో సమంగా నిలిచారు. FIDE నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడు చెస్ వరల్డ్ టైటిల్ గెలవాలంటే 7.5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఇది జరగకపోతే, టైబ్రేకర్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. చివరి గేమ్‌లోనూ గేమ్ టై దిశగా సాగినా.. ఆ తర్వాత చైనా గ్రాండ్ మాస్టర్ పొరపాటు చేసి గుకేష్‌కు చరిత్ర సృష్టించే అవకాశం ఇచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..