Warangal: శివాంగిలా శివమెత్తిన యువతి.. పక్కా స్కెచ్‌తో పిలిచి, ఆకతాయిల తాట తీసింది..!
నిత్యం వేధిస్తున్న ఆకతాయికి తగిన బుద్ధి చెప్పింది యువతి. పక్కా స్కెచ్ వేసి పిలిపించి అందరి ముందు చితకబాదింది.
జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి శివమెత్తింది. తనను వేధిస్తున్న ఆకతాయిలను తగిన బుద్ధి చెప్పింది. వారి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసింది. వారిని వెంటపడి మరీ, ఎడాపెడా వాయించింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద జరిగింది.
గానుగుపహాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రెండు రోజుల నుండి ఓ యువతి వెంటపడి వేధిస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో, వెకిలి చేష్టలతో వేధించారు. దీంతో శివమెత్తిన యువతి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చిక్కకపోవడంతో మాట్లాడదాం రమ్మంటూ మధ్యవర్తులతో పిలిపించింది. బతుకమ్మ కుంట వద్దకు చేరుకోగానే ఆ యువతితో సహా కుటుంబ సభ్యులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు.
అతగాడిని పట్టుకుని ఎడా పెడా వాయించారు. దేహశుద్ధి చేశారు. చివరికి జరిగి దానికి క్షమాపణ చెప్పడంతో శాంతించిన యువతి కుటుంబసభ్యులు వదిలేశారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..