యువరాజ్ సింగ్ డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత బీసీసీఐ నుంచి ఎంత అందుతోంది?
మీడియా కథనాల ప్రకారం యువరాజ్ సింగ్‌కు నెలకు రూ.22,500 పెన్షన్ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది అధికారిక లెక్క కాదు.
2019లో రిటైర్‌మెంట్‌కు ముందు పేపర్లలో నమోదు చేసిన బీసీసీఐ నుంచి యువరాజ్ అందుకోబోయే మొత్తం ఇదేనని బోర్డు అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ మీడియా సంస్థ రాసింది.
అయితే యువరాజ్ సింగ్‌కి ఇదొక్కటే ఆదాయ వనరు కాదు. యువరాజ్ మొత్తం సంపద దాదాపు రూ.291 కోట్లు ఉంటుందని సమాచారం.
యువరాజ్ తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి ప్రతి నెలా దాదాపు రూ. 1 కోటి సంపాదిస్తాడు. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు.
యువరాజ్ తన ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సెంటర్ నుండి కూడా చాలానే సంపాదిస్తాడు. ఈరోజు యువరాజ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా అయనకు ఫ్యాన్స్ విషేస్ చెబుతున్నారు.
2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు బాదాడు. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు యువరాజ్..
వన్డే క్రికెట్‌లో 5వ స్థానంలో ఆడుతున్నప్పుడు యువరాజ్ సింగ్ 7 సెంచరీలు సాధించాడు. ఈ నెంబర్లో ఆడుతున్నప్పుడు అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు యువరాజ్ సింగ్‌కు ఉంది.