Allu Arjun: వాళ్లు సర్వనాశనమైపోతారు.. అల్లు అర్జున్ అరెస్టు పై రచయిత ఎమోషనల్..
అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారని అన్నారు గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ. బన్నీ విడుదల తర్వాత ఆయన ఇంటికి చేరుకున్న చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం తన నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వస్తున్నారు. అక్కడే బన్నీతోపాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు బన్నీ ఇంటి ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన సీని రచయిత చిన్నికృష్ణ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని అన్నారు సినీ రచయిత చిన్ని కృష్ణ. బన్నీ పై ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ మొదటి సినిమాకు నేనే రచయితను.. ఆయనంటే నాకు ప్రాణమంటూ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.