Sai Pallavi: ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. వాళ్లికి సాయి పల్లవి సీరియస్ మెసేజ్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించనుండగా.. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు.
అలాగే ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. అయితే హిందీలో రామాయణం సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదోక రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకున్నారని కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించించారు సాయి పల్లవి. రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసారని.. బయటి ఫుడ్ అస్సలు తినడంలేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వార్తలు నెట్టంట వైరలయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసారు సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుంని హెచ్చరించారు. నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Manoj: నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
Pushpa 2: 6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

