Manchu Manoj: నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
మంచు ఫ్యామిలీలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ చేరాయి. గత మూడు రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు తారస్థాయికి చేరాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంచో మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదు చేశారు.
మంగళవారం మరోసారి మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితిని కవరేజీ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ చేతిలోని మైక్ లాక్కొని అతడిపై బలంగా దాడి చేశారు. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్ కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీసులు ఇవ్వడంతో బుధవారం మంచు విష్ణు, మనోజ్ వేర్వేరుగా పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సుధీర్ బాబు ముందు హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: 6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..