వయసు పెరిగే కొద్దీ మనుషులు ఎత్తు తగ్గుతారా ??
వయసు పెరిగే కొద్దీ మనుషుల శరీరంలో మార్పులు రావడం సహజం. అయితే వయసు పెరిగే కొద్దీ మనుషులు కుంచించుకుపోతారని మీకు తెలుసా? అవును 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పురుషులు ఒక అంగుళం, స్త్రీలు రెండు అంగుళాలు కోల్పోతారట. 80 ఏళ్ల తర్వాత మరో అంగుళం కోల్పోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
వృద్ధాప్యంలో కీళ్ల మధ్య మృదులాస్థి అరిగిపోతుంది. బోలు ఎముకల వ్యాధి వస్తుంది. దీంతో వెన్నెముక పొట్టిగా మారుతుందంటున్నారు వైద్యులు. వయసు పెరిగే కొద్దీ లీన్ కండర ద్రవ్యరాశిని కోల్పోతారు. కానీ కొవ్వు పెరుగుతుంది. ఇది సార్కోపెనియాగా చెప్పే పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు. బోలు ఎముకల వ్యాధి.. శరీరంలో ఎముకలు బలహీనంగా మారడానికి, పగుళ్లకు కారణమవుతుంది. ఇది వ్యక్తి.. పొట్టిగా మారడానికి కూడా కారణమవుతుంది. ఒక సంవత్సరం లోపల ఒకటి నుండి రెండు అంగుళాలు కోల్పోయే వారికి వెన్నెముక, తుంటి పగుళ్లు, అలాగే పురుషులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే కొన్ని మార్పులను నియంత్రించలేకపోయినా కొన్ని అలవాట్లను మార్చుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకూ అందరూ అర్హులే
ఆధార్ లా ఇక అపార్ కార్డు.. ఇది ఎవరికోసం అంటే ??
ఆ క్రిస్మస్ లింక్ ఓపెన్ చేస్తే.. నిలువుదోపిడీయే !!
TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్ రికార్డ్ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్