ఆధార్ లా ఇక అపార్ కార్డు.. ఇది ఎవరికోసం అంటే ??
ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఉంది. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో అపార్ ఐడీ పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాన్ కార్డులాగా ముఖ్యమైన గుర్తింపుగా ఉపయోగపడనుంది.
ముఖ్యంగా అకడమిక్ పనులకు ఈ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. అయితే APAAR Card అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. అపార్ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్య, విద్యా అవసరాలకు సంబంధించిన గుర్తింపు కార్డు. ఈ అపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల వరకు జారీ చేస్తారు. అయితే, మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ అపార్ కార్డు ప్రతీ బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు విద్యార్హతకు సంబంధించిన ముఖ్యమైన రుజువు అని అనడంలో సందేహం లేదు. ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ క్రిస్మస్ లింక్ ఓపెన్ చేస్తే.. నిలువుదోపిడీయే !!
TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్ రికార్డ్ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ఏదీ మనది కాదు.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్
అమితాబ్ తర్వాత అమీర్.. బాలీవుడ్ స్టార్లతో.. రజినీ మాస్టర్ ప్లాన్
Sai Pallavi: ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. వాళ్లికి సాయి పల్లవి సీరియస్ మెసేజ్