Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇన్ఫోసిస్‌లో జాబ్ వద్దని ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు పాన్ ఇండియా ఫేమస్

  'డాక్టర్ అవ్వాల్సింది.. అనుకోకుండా యాక్టర్ అయ్యాం', 'ఇంజినీరింగ్ చదివాం.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాం'.. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లలో చాలామంది మెడిసిన్, ఇంజనీరింగ్ చదివినవారే. పై ఫొటోలో ఉన్న నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇన్ఫోసిస్‌లో జాబ్ వద్దని ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు పాన్ ఇండియా ఫేమస్
Tollywood Actor

Updated on: Feb 16, 2025 | 4:54 PM

పై ఫొటోలో బక్కపల్చని దేహంతో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఫేమస్ నటుడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా నటుడిగా ఫేమస్ అయిపోయారు. హీరోగా, విలన్ గానే కాకుండా నిర్మాతగానూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తన నటనా ప్రతిభకు గుర్తింపుగా ఏకంగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఒక పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి చదువుకున్నాడు.పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలిచాడు. ఆపై ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అయితే నటనపై ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. థియేటర్ రంగంలో కోర్సులు పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత తన స్వయం కృషితో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. నటుడిగా అశేష అభిమానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అతనెవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు పుష్ప విలన్ జాలి రెడ్డి అలియాస్ డాలీ ధనంజయ.

కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతోన్న డాలీ ధనంజయ ఆదివారం (ఫిబ్రవరి 16) వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ధన్యత అనే వైద్యురాలితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ నటుడి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో డాలీకి సంబంధించి చిన్ననాటి, అరుదైన ఫొటోలు ఇప్పుడు నెట్టిం తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో అదే.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకలో పుష్ప నటుడు..

అల్లు అర్జున్ నటించిన పుష్ఫ, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డిగా ఆకట్టుకున్నాడు డాలీ ధనంజయ. ఇందులో అతని పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో పాటు సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు డాలీ.

భార్య ధన్యతతో డాలీ ధనంజయ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..