Tollywood: ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్.. పుష్ప మూవీలో నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న చిన్నారి సోషల్ మీడియా సెన్సెషన్. కేవలం ఒకే ఒక్క డైలాగ్తో తెగ ఫేమస్ అయ్యింది. చిన్న సినిమాలో హీరోయిన్ గా నటించిన ఒక్కసారిగా తెలుగు అడియన్స్ చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న ఆ అమ్మాయి ఇటీవలే హీరోయిన్ గా వెండితెరపై సందడి చేసింది.

సోషల్ మీడియాలో తారల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే మీకోసం ఇప్పుడు మరో నవతరం కథానాయిక ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న చిన్నారి సోషల్ మీడియా సెన్సెషన్. కేవలం ఒకే ఒక్క డైలాగ్తో తెగ ఫేమస్ అయ్యింది. చిన్న సినిమాలో హీరోయిన్ గా నటించిన ఒక్కసారిగా తెలుగు అడియన్స్ చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న ఆ అమ్మాయి ఇటీవలే హీరోయిన్ గా వెండితెరపై సందడి చేసింది. ఆ ఒక్క డైలాగ్ చెబితే మీరు గుర్తుపట్టేస్తారు. ఇంతకీ ఏంటా డైలాగ్ అనుకుంటున్నారా..అదే సమోసా డైలాగ్. “సమోసా తింటావా శిరీష” అని హీరో అడిగితే.. ‘ఆకలైతలేదు నువ్వు తిను’ అంటూ ఆన్సర్ ఇస్తుంది. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు.
పరేషాన్ సినిమాలోని ఈ ఒక్క డైలాగ్ తో కథానాయికగా ఆ అమ్మాకి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇంతకీ తన పేరు గుర్తుంది కదా.. శిరీష.. అలియాస్ పావని కరణం. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన పావని.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. లివింగ్ టుగెదర్ పొట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత గాడ్స్ ఆఫ్ ది ధర్మపురి సినిమాలో నటించచింది. అలాగే తిరువీర్ నటించిన సిన్ మూవీలోనూ నటించింది.
View this post on Instagram
అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనకోడలిగా నటించింది. అలాగే ఈ బ్యూటీ పుష్ప 2లో నటించబోతుందని తెలుస్తోంది. కానీ పరేషాన్ సినిమాతో తెలుగులో గుర్తింపు వచ్చింది. రానా దగ్గుబాటి సమర్పణలో నచ్చిన ఈ మూవీలో తిరువీర్ హీరోగా నటించారు. అలాగే మోడ్రన్ లవ్ హైదరాబాద్ లో నటించింది. నాని నిర్మించిన హిట్ 2 మూవీలో కనిపించింది. అలాగే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన పావని.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




