Tollywood: చిరునవ్వుల చిన్నారి సీనియర్ టాలీవుడ్ హీరోయిన్.. అందంలో ఏమాత్రం తగ్గని వయ్యారి..
గ్లామర్ రోల్స్ కు సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ భామ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.
సోషల్ మీడియాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో చిరునవ్వులు చిందిస్తోన్న ఆ చిన్నారి ఇప్పుడు తెలుగు వారికి ఇష్టమైన అమ్మాయి. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. గ్లామర్ రోల్స్ కు సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ భామ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ప్రియమణి. దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తాజాగా విజయ్ దళపతి నటిస్తున్న తలపతి 69 చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యింది.
హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రియమణి 1984 జూన్ 4న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. కానీ ఆమె స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ప్రియమణి బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించింది. స్కూల్లో చదువుతున్నప్పుడే వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ప్రియమణి 2003లో విడుదలైన ఎవరే అతగాడు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. 2004లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన “కన్ నీలాల్ అయుత్ సే” చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.
తమిళం, తెలుగు, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ తమిళ చిత్రసీమలోనే కాకుండా భారతీయ చిత్రసీమలో కూడా తనకంటూ ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది నటి ప్రియమణి. ప్రియమణి గతంలో ‘రావణ్’, ‘రక్త చరిత్ర 2’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఆమె మనోజ్ బాజ్‌పేయికి జోడీగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్న ప్రియమణి ప్రస్తుతం తమిళంలో కొటేషన్ గ్యాంగ్ అనే చిత్రంలో నటిస్తోంది. హిందీ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.