AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ నాట్యమాయూరిని గుర్తుపట్టరా..? తెలుగువారికి ఇష్టమైన యాంకర్..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని యాంకరమ్మ. బుల్లితెరపై ప్రతి ఛానల్లో ఓ షో.. ప్రతి సినిమా ఈవెంట్లకు ఆమె ఉండాల్సిందే. చిన్న సినిమా నుంచి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ప్రతి చిన్న కార్యక్రమానికీ తనే వ్యాఖ్యత. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.

Tollywood: ఈ నాట్యమాయూరిని గుర్తుపట్టరా..? తెలుగువారికి ఇష్టమైన యాంకర్..
Actress
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2024 | 7:42 PM

Share

సాధారణంగా తెలుగు సినీ తారల చిన్ననాటి ఫోటోస్.. వారి చైల్డ్ హుడ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా నెట్టింట సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఓ నాట్యమయూరి చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో ఉన్న ఓ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన యాంకర్. బుల్లితెరపై ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని యాంకరమ్మ. బుల్లితెరపై ప్రతి ఛానల్లో ఓ షో.. ప్రతి సినిమా ఈవెంట్లకు ఆమె ఉండాల్సిందే. చిన్న సినిమా నుంచి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ప్రతి చిన్న కార్యక్రమానికీ తనే వ్యాఖ్యత. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే యాంకర్ సుమ. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి సుపరిచితురాలు.

తన చలాకీతనం.. వాక్చాతుర్యంతో తెలుగునాట టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. ఇక సుమ వేసే పంచుల గురించి చెప్పక్కర్లేదు. టీవీల్లో షోలు బోరింగ్ గా సాగకుండా తనదైన పంచులతో కామెడీని పండిస్తూ అందర్నీ అలరిస్తుంది. సుమ నిజానికి కేరళ అమ్మాయి. కానీ తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతుంది. 1974 మార్చి 22న కేరళలో జన్మించిన సుమ.. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో నటనవైపు అడుగులు వేసింది. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1999 ఫిబ్రవరి 10న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి బాబు, పాప ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో నటించిన సుమా.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొన్నేళ్లుగా బుల్లితెరకు అంకితమైంది. పలు ఛానల్లో వరుసగా షోలు చేస్తుంది సుమ. ఆమె యాంకరింగ్ ఎన్ని గంటలకైనా ప్రేక్షకులకు బోర్ కొట్టదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us