Tollywood: ఈ రెండు జళ్ల సీత ఎవరో గుర్తుపట్టగలరా ?.. టాలీవుడ్లో తెగ ఫేమస్.. హీరోయిన్ స్నేహితురాలు..
ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఎన్నో సినిమాల్లో సహాయ నటిగా.. హీరోయిన్ స్నేహితురాలిగా.. హీరో చెల్లెలిగా కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ పోతినేని, మహేష్ బాబు వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలో కనిపించి మెప్పించింది. ఇక కొన్ని సినిమాల్లో కథానాయికగానూ అలరించింది. తనే కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. 1989 ఆగస్ట్ 6న బెంగుళూరులో జన్మించింది ధన్యబాలకృష్ణ.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఎన్నో సినిమాల్లో సహాయ నటిగా.. హీరోయిన్ స్నేహితురాలిగా.. హీరో చెల్లెలిగా కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ పోతినేని, మహేష్ బాబు వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలో కనిపించి మెప్పించింది. ఇక కొన్ని సినిమాల్లో కథానాయికగానూ అలరించింది. తనే కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. 1989 ఆగస్ట్ 6న బెంగుళూరులో జన్మించింది ధన్యబాలకృష్ణ. తమిళ్ హీరో సూర్య, శ్రుతిహాసన్ కలిసి నటించిన 7th సెన్స్ సినిమాతో తొలిసారి నటిగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో కనిపించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబును ప్రేమించి అతడికి ప్రపోజ్ చేసే అమ్మాయిగా కనిపించింది. ఆ తర్వాత రామ్ పోతినేని, కీర్తి సురేష్ నటించిన నేను శైలజ మూవీలో కీర్తి స్నేహితురాలిగా నటించింది. అంతేకాకుండా తెలుగులో అనేక సినిమాల్లో సహాయ నటిగా కనిపించిన ధన్య.. జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
అయితే ఈ బ్యూటీకి హీరోయిన్గా అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇటు తెలుగు, అటు తమిళం భాషలలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలు, 10 వెబ్ సిరీస్ లలో నటించింది ధన్య. ప్రస్తుతం ధన్య బాలకృష్ణ షేర్ చేసిన తన చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ వైరలవుతుండగా.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. గతంలో ధన్య బాలకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి. తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ను ఆమె సీక్రెట్ గా వివాహం చేసుకుందని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ అధికారికంగా ధ్రువికరించాడు. తమకు 2020 జనవరిలోనే పెళ్లి జరిగినట్లు తెలిపాడు. బాలాజీ మారి 1, మారి 2 సినిమాలకు దర్శకత్వం వహించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.