Tollywood: చిన్నప్పటి స్కూల్ ఫోటో షేర్ చేసిన హీరోయిన్ మీనా.. ఇంతకీ ఎక్కడుందో గుర్తుపట్టగలరా.. ?

|

Sep 05, 2024 | 4:34 PM

తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా సైతం తన ఇన్ స్టాలో చిన్నప్పటి స్కూల్ ఫోటో షేర్ చేసింది. పాఠశాలలో చదివేటప్పుడు తన క్లాస్ స్టూడెంట్స్ అంతా ఓ టీచర్ తో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ టీచర్స్ డే విషెస్ తెలిపింది. అలాగే అందులో తను ఎక్కడ ఉందో కనిపెట్టాలంటూ ఫాలోవర్లకు పరీక్ష పెట్టింది.

Tollywood: చిన్నప్పటి స్కూల్ ఫోటో షేర్ చేసిన హీరోయిన్ మీనా.. ఇంతకీ ఎక్కడుందో గుర్తుపట్టగలరా.. ?
Meena
Follow us on

సెప్టెంబర్ 5 టీచర్స్ డే. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమ చిన్ననాటి స్కూల్ డేస్ ఫోటోస్ షేర్ చేస్తూ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు సెలబ్రెటీస్ కూడా తమ స్కూల్, కాలేజ్ డేస్ ఫోటోస్ పంచుకుంటూ అభిమానులతోపాటు టీచర్స్ డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా సైతం తన ఇన్ స్టాలో చిన్నప్పటి స్కూల్ ఫోటో షేర్ చేసింది. పాఠశాలలో చదివేటప్పుడు తన క్లాస్ స్టూడెంట్స్ అంతా ఓ టీచర్ తో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ టీచర్స్ డే విషెస్ తెలిపింది. అలాగే అందులో తను ఎక్కడ ఉందో కనిపెట్టాలంటూ ఫాలోవర్లకు పరీక్ష పెట్టింది.

పైన ఫోటోను చూశారు కదా.. అందులో హీరోయిన్ మీనా కూడా ఉంది. ఎక్కడో కనిపెట్టండి.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో అప్పట్లో సినీ ప్రియులను కట్టిపడేసింది. నటీగా సినీపరిశ్రమలో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో సహాయ పాత్రలలో నటిస్తుంది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. ఇంతకీ కనిపెట్టారా..? ఆ ఫోటోలో మొదటి లైన్లో చిరునవ్వులు చిందిస్తున్న సెకండ్ అమ్మాయి.

ఇవి కూడా చదవండి

Actress Meena

హీరోయిన్ మీనా.. మద్రాసులో పుట్టి పెరిగినా ఆమె తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన మీనా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రలలో నటిస్తుంది.

మీనా ఇన్ స్టా.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.