AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: కాంతారను కాపీ కొట్టిన తహసీల్దార్‌.. యాక్టింగ్‌ చూసి కదిలి వచ్చిన కలెక్టర్‌.. వీడియో వైరల్..

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ అధికారి కొద్దిరోజుల క్రితం ‘కాంతార’ సినిమా దైవం లా గెటప్ వేసి  అందరి దృష్టిని ఆకర్షించారు . విజయనగరం జిల్లా కు చెందిన తహశీల్దార్ ప్రసాదరావు కాంతార దైవరూపంలో

Kantara: కాంతారను కాపీ కొట్టిన తహసీల్దార్‌.. యాక్టింగ్‌ చూసి కదిలి వచ్చిన కలెక్టర్‌.. వీడియో వైరల్..
Kantara
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 4:40 PM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించారు. కేరళ ఆదివాసీల ఆచార సంప్రదాయలు.. తుళునాడు కథ అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రేక్షకలను మెప్పించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్‌గా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రా, తెలంగాణా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోనే క్లైమాక్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పి్స్తోంది. క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటన ఆకట్టుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ అధికారి కొద్దిరోజుల క్రితం ‘కాంతార’ సినిమా దైవం లా గెటప్ వేసి  అందరి దృష్టిని ఆకర్షించారు . విజయనగరం జిల్లా కు చెందిన తహశీల్దార్ ప్రసాదరావు కాంతార దైవరూపంలో నాట్యం చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  వేదికపై కాంతార చిత్రంలోని వరాహ రూపం  పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ నాట్యం చేసినందుకు అతడు మొదటి బహుమతి గెలుచుకున్నందుకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పన్నుల శాఖ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో పలువురు అధికారులు పాల్గొంన్నారు. ‘కాంతార’ సినిమాలో తహసీల్దార్ ప్రసాదరావు గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రసాదరావుకి కళలంటే చాలా ఆసక్తి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కూడా ‘కాంతారావు’ సినిమా లాగా వేషం వేసుకుని రావడం చూసి ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ‘కాంతారా’ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఇందులో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్, మానసి సుధీర్, ప్రమోద్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీకి వెళ్లనుంది. ఇంట్లో కూర్చుని సినిమాను ఎంజాయ్ చేసేందుకు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. OTT టెలికాస్ట్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.