Sumanth Prabhas: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని తెలుసు.. కానీ ఒక్క కారణంతో వదులుకున్నా: సుమంత్ ప్రభాస్
'మేమ్ ఫేమస్’ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్ ప్రభాస్. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గానూ ఆకట్టుకున్నాడీ అబ్బాయి. తాజాగా 'గోదారి గట్టుపైన' అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్ ప్రభాస్.

‘మేమే ఫేమస్’ అనే సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. మొదటి సినిమాతోనే మంచి నటుడిగానూ, డైరెక్టర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా మూడేళ్ల సమయం తీసుకున్నాడీ యంగ్ హీరో. రీసెంట్ గా గోదారి గట్టుపైన అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబడుతోంది. అయితే తన సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమంత్ ప్రభాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేమ్ ఫేమస్’ విజయం సాధించిన తర్వాత హీరోగా సుమంత్ ప్రభాస్ కి చాలా ఆఫర్లు వచ్చాయట. అయితే తొందరపడకుండా మంచి కథ ఎంపిక చేసుకోవాలనే ప్రాసెస్ లో దాదాపు 50 కథలను రిజెక్ట్ చేశాడట. అందులో బ్లాక్ బస్టర్ మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ఉందని సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
‘రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోగా నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నాను. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అన్నతో చెప్పాను. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అయితే అప్పుడే మేమే ఫేమస్ అనే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమోనని మనసుకు అనిపించింది. కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే సాయిలు అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా అద్భుతంగా తీశాడు. నేను అనుకున్న దానికంటే సినిమాను బాగా ప్రెజెంట్ చేశాడు’ అని సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
గోదారి గట్టుపైన సినిమా ప్రమోషన్లలో సుమంత్ ప్రభాస్..
View this post on Instagram
వైజాగ్ టూర్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




