AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar: ‘ధురంధర్’ సినిమాలో అసలు స్టోరీ ఎక్కడుంది? 3వేల కోట్ల బ్లాక్ బస్టర్ పై స్టార్ డైరెక్టర్ విమర్శలు

దర్శకుడు ఆదిత్య ధర్ - హీరో రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన 'ధురందర్', ధురంధర్ ది రివేంజ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రెండూ కలిపి దాదాపు రూ.3వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్స్ పై తీవ్ర విమర్శలు చేశాడు ఓ స్టార్ డైరెక్టర్.

Dhurandhar: 'ధురంధర్' సినిమాలో అసలు స్టోరీ ఎక్కడుంది? 3వేల కోట్ల బ్లాక్ బస్టర్ పై స్టార్ డైరెక్టర్ విమర్శలు
Dhurandhar
Basha Shek
|

Updated on: Sep 09, 2026 | 8:00 AM

Share

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 3,000 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించాయి. అయితే, ఈ సినిమా విజయం, దాని కథాంశంపై ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘ధురందర్‌లో అసలు కథే లేదు’ అని అక్కసు వెళ్లగక్కారు. ‘కరెంట్ స్టేట్ ఆఫ్ మీడియా అండ్ ఫిల్మ్’ కార్యక్రమానికి హాజరైన టిగ్మాన్షు ధూలియా బాలీవుడ్‌లో కథ చెప్పే శైలి కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన దీనికి ఉదాహరణగా ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలను పేర్కొన్నారు. ‘మిమ్మల్ని ఎవరైనా ‘ధురందర్’ సినిమా కథ ఏమిటని అడిగితే, మీరు ఏమీ చెప్పలేరు. ఒక హీరో పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ బీభత్సం సృష్టిస్తాడు. ఇది అసలు కథేనా? సినిమాల్లో కథలే లేనట్టుగా ఉంది. కథలు చెప్పే దర్శకులు కనుమరుగవుతున్నారు, నిజమైన కథలు చెప్పాలనుకునే వారికి అవకాశం దక్కడం లేదు. అందరూ ఒకే రకమైన సినిమాలను అనుకరిస్తున్నారు’ అని టిగ్మాన్షు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా సినిమా ఇండస్ట్రీలో కథలు కొరవడటానికి పెట్టుబడిదారీ విధానమే కారణమని ఆయన అన్నారు. ‘అతిగా పెట్టుబడిదారీ విధానం ఉన్న వ్యవస్థలో, ప్రతిదీ ఒకేలా కనిపించడం మొదలవుతుంది. నేటి ఫ్యాషన్‌ను చూడండి, అందరి హెయిర్‌స్టైల్ ఒకేలా ఉంది. నగరాలు కూడా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒకేలా కనిపిస్తున్నాయి. నా స్వస్థలం అలహాబాద్ దాని ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది ఇతర నగరాలలాగే మాల్స్, కార్లతో నిండిపోయింది. ఇటువంటి వ్యవస్థ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను నాశనం చేస్తుంది,” అని ఆయన అన్నారు.

కాగా ధురంధర్, ధురంధర్ ది రివేంజ్ సినిమాలకు సంబంధించి టిగ్మాన్షు ధూలియా చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోది. ఒక ట్విట్టర్ యూజర్, “మరో అసూయపరుడైన దర్శకుడు పుట్టుకొచ్చాడు” అని వ్యాఖ్యానించగా, మరొకరు, “ఇది అసూయకు పరాకాష్ట” అని విమర్శించారు. మరి ఈ విమర్శలకు టిగ్మాన్షు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'ధురంధర్'లో అసలు స్టోరీ ఎక్కడుంది? స్టార్ డైరెక్టర్ విమర్శలు
'ధురంధర్'లో అసలు స్టోరీ ఎక్కడుంది? స్టార్ డైరెక్టర్ విమర్శలు
తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు..
తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు..
ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?
ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?
తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. 45 నిమిషాల్లోనే అక్కడికి..
తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. 45 నిమిషాల్లోనే అక్కడికి..
పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి
పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి
ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకుకు చిటికెలో చెక్
ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకుకు చిటికెలో చెక్
దులీప్ ట్రోఫీ ఫైనల్లో దుమ్ములేపిన షమీ
దులీప్ ట్రోఫీ ఫైనల్లో దుమ్ములేపిన షమీ
ప్రజలకు డబుల్ ధమాకా.. రూ.32కే ఉల్లిపాయలు, సబ్సిడీపై కందిపప్పు!
ప్రజలకు డబుల్ ధమాకా.. రూ.32కే ఉల్లిపాయలు, సబ్సిడీపై కందిపప్పు!
సీక్రెట్‌ అంతా కలర్స్‌లోనే ఉందా? 2027 మార్కెట్‌లోకి కవాసకి
సీక్రెట్‌ అంతా కలర్స్‌లోనే ఉందా? 2027 మార్కెట్‌లోకి కవాసకి
ఉబర్, ర్యాపిడ్, ఓలా తరహాలో తెలంగాణ ప్రభుత్వం యాప్.. ధరలు చాలా..
ఉబర్, ర్యాపిడ్, ఓలా తరహాలో తెలంగాణ ప్రభుత్వం యాప్.. ధరలు చాలా..