AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గంధర్వ’గా రానున్న జార్జిరెడ్డి హీరో.. షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. రిలీజ్ ఎప్పుడంటే ?..

వంగవీటి రాధ, జార్జిరెడ్డి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో సందీప్ మాధవ్. తాజాగా శాండీ మరో సినిమా గంధర్వతో రాబోతున్నాడు.

'గంధర్వ'గా రానున్న జార్జిరెడ్డి హీరో.. షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. రిలీజ్ ఎప్పుడంటే ?..
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2020 | 8:12 AM

Share

వంగవీటి రాధ, జార్జిరెడ్డి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో సందీప్ మాధవ్. తాజాగా శాండీ మరో సినిమా గంధర్వతో రాబోతున్నాడు. ఈ సినిమాలో గాయత్రి ఆర్. సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ వీరశంకర్ సిల్వర్ స్కీృన్స్ బ్యానర్లపై యం.యన్. మధు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 27న హైదరాబాద్‏లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. అనంతరం శ్రీకాంత్ కెమెరా స్వీచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. “జార్జిరెడ్డి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‏లో ఉన్నాయి. దర్శకుడు అప్సర్ చెప్పిన కథ కొత్తగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశా. సాయికుమార్, సురేష్, బాబుమోహన్ లాంటీ సీనియర్ నటులతో కలిసి నటించనుండడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

అటు డైరెక్టర్ అప్సర్ మాట్లాడుతూ.. “వీరశంకర్ గారికి చాలా కథలు చెప్పాను. కానీ ఆయన ఇంకా బాగుండాలి, ఇంకా ఆలోచించు అని చెప్పారు. దీంతో చాలా రోజులు తర్వాత మంచి కాన్సెప్ట్‏తో వెళ్ళి వీరశంకర్ గారికి చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పారు. శాండీ చేస్తున్నది మిలటరీ క్యారెక్టర్ అయినా ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. గంధర్వ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. కాగా వచ్చే ఏడాది మే 21న ఈ సినిమాను విడుదల చేయడానికి మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు” అని అన్నారు.

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌