AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఫ‌క్కీలో హీరోయిన్ పూర్ణ కిడ్నాప్​ ప్లాన్​..

హీరోయిన‌ పూర్ణను బ్లాక్​ మెయిల్​ చేసిన కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. మరో నలుగురి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

సినీ ఫ‌క్కీలో హీరోయిన్  పూర్ణ కిడ్నాప్​ ప్లాన్​..
 హీరో రాజ్ తురుణ్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ ‘పవర్ ప్లే’ పూర్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. 
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2020 | 11:17 PM

Share

హీరోయిన‌ పూర్ణను బ్లాక్​ మెయిల్​ చేసిన కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. మరో నలుగురి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ విషయాన్ని కొచ్చి నగర పోలీస్​ కమిషనర్​​ విజయ్​ సఖ్రే వెల్ల‌డించారు. నిందితులు పూర్ణను సినీఫక్కీలో కిడ్నాప్​ చేసేందుకు భారీ ప్లాన్ రెడీ చేసిన‌ట్టు వివరించారు సఖ్రే.

తొలుత‌ పూర్ణ మ్యారేజ్ గురించి మాట్లాడి ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో పరిచయం ఏర్పరచుకుని, అనంతరం కిడ్నాప్ చేయాలని ముఠా ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్టు స‌ఖ్రే తెలిపారు. ఓ హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున భారీగా డ‌బ్బు దండుకోవాల‌ని స్కెచ్ వేసిన‌ట్టు పేర్కొన్నారు. వీళ్ల టార్గెట్ లో ఎప్పుడూ న‌టీన‌టులే ఉంటార‌ని, ఈ ఏడాది మార్చిలోనూ పాలక్కాడ్​లో ఎనిమిది మంది మోడల్స్​ను కిడ్నాప్ చేసి..వారి వ‌ద్ద నుంచి డ‌బ్బూలు వ‌సూలు చేశార‌ని పేర్కొన్నారు. .ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ క‌మెడియ‌న్ ధర్మజన్ బోల్గట్టిని కూడా విచారించినట్లు తెలిపారు సఖ్రెే. ఇందులో ఇతర సినీ వ్యక్తుల హస్తం లేదని నిర్దారించారు.