AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..

పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని హీరోలకు అన్ని ఏరియాల్లో అభిమానులు పెరిగిపోతున్నారు. ఎంతో మంది స్టార్ ఆర్టిస్టులు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. హీరోల అలవాట్ల గురించి, వారి ఆస్తులు, ఇళ్లు , కార్లు ఇలా తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..
Ntr , Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2024 | 1:20 PM

Share

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తుంది. దాంతో సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే బ్యారికేట్స్ తొలిగిపోయాయి. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని హీరోలకు అన్ని ఏరియాల్లో అభిమానులు పెరిగిపోతున్నారు. ఎంతో మంది స్టార్ ఆర్టిస్టులు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. హీరోల అలవాట్ల గురించి, వారి ఆస్తులు, ఇళ్లు , కార్లు ఇలా తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో హీరో యష్ , అల్లు అర్జున్, సమంత , రష్మిక మందన్న , ఎన్టీఆర్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒకొక్కరి గురించి తెలుసుకుందాం..!

రష్మిక మందన్న

సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ డిమాండ్‌ క్రియేట్‌ చేసుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మకు  ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఎక్కువ. రోజులో ఎక్కువ సమయం వర్కవుట్ చేస్తుంది రష్మిక.

ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘కల్కి 2898 AD’తో పాటు పలు సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ప్రభాస్ కు ఆహారం పట్ల మక్కువ ఎక్కువ. హోటల్ భోజనం కంటే ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అంతే కాదు షూటింగ్స్ కూడా హోమ్ ఫూడ్ నే తెప్పిస్తుంటాడు డార్లింగ్.

సమంత

స్టార్ హీరోయిన్ గా సమంత దూసుకుపోతోంది. సమంత కూడా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. మాయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూనే వర్కౌట్స్ కూడా చేసింది.

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత ‘వార్ 2’ చేస్తున్నాడు. తారక్ కు  9 నంబర్‌ అంటే చాలా ఇష్టం.  అది అయన లక్కీ నెంబర్ . తారక్ ట్విట్టర్ హ్యాండిల్ 9. ఆయన కారు నంబర్ ప్లేట్ నంబర్ 9999.

 రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయనకు లగ్జరీ వాచీలంటే క్రేజ్. చరణ్ దగ్గర కోటి రూపాయల విలువైన వాచీలు ఉన్నాయి.

దుల్కర్ సల్మాన్

హ్యాండ్సమ్ హంక్ దుల్కర్ సల్మాన్‌కి కార్ క్రేజ్ ఉంది. అతని దగ్గర చాలా కార్ కలెక్షన్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.