Trending: హుర్రే… వీవీఎస్ లక్ష్మణ్ కుమార్తెను చూశారా..? హీరోయిన్స్‌ను మించిన అందం
లక్ష్మణ్.. తిరుమల శ్రీవారికి అపర భక్తుడు.. వీలు కుదిరినప్పుడల్లా ఆయన.. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్తారు. ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఆయన తిరుమల వచ్చారు. ఆలయ పుష్పాలంకరణకు ఒక రోజు ఖర్చు రూ. 15 లక్షలను విరాళంగా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా.. లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దిగిన ఫోటోల్లో ఆయన.. కుమార్తెను ఆసక్తిగా గమనించారు నెటిజన్స్.
వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్..కానీ అతడిని వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలుస్తుంటారు.. ఫ్యాన్స్. భారత క్రికెట్ లెజెండ్స్‌లో ఈయన పేరు కూడా ముందుకు వరసలో ఉంటుంది. 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పారు లక్ష్మణ్. ప్రపంచ క్రికెట్‌కు మణికట్టు మంత్రజాలాన్ని పరిచయం చేసిన అత్యుత్తమ క్రికెటర్లలో వీవీఎస్ ఒకరు. అతని అప్రయత్న స్ట్రోక్‌ప్లే, మణికట్టు ఫ్లెక్సిబిలిటీ కారణంగా లక్ష్మణ్‌ను ‘‘వెరీ వెరీ స్పెషల్’’ క్రికెటర్‌గా పరిగణిస్తారు నిపుణులు. లక్ష్మణ్ తెలుగు వ్యక్తే కావడం మనందరికీ గర్వకారణం. చాలామందికి తెలియని ఆసక్తికర విషయం ఏంటంటే.. వీవీఎస్ లక్ష్మణ్.. భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ ముని మనవడు. లక్ష్మణ్ తల్లిదండ్రులు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివాడు. మెడికల్ కోర్సులో చేరి.. చివరకు బ్యాట్ చేతపట్టి క్రికెటర్ అయ్యాడు. గుంటూరుకు చెందిన జీఆర్ శైలజను 2004లో మ్యారేజ్ చేసుకున్నాడు లక్ష్మణ్. వీరికి కుమారుడు సర్వజిత్, కుమార్తె అచింత్య ఉన్నారు.
లక్ష్మణ్.. తిరుమల శ్రీవారికి అపర భక్తుడు.. వీలు కుదిరినప్పుడల్లా ఆయన.. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్తారు. ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఆయన తిరుమల వచ్చారు. ఆలయ పుష్పాలంకరణకు ఒక రోజు ఖర్చు రూ. 15 లక్షలను విరాళంగా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా.. లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దిగిన ఫోటోల్లో ఆయన.. కుమార్తెను ఆసక్తిగా గమనించారు నెటిజన్స్. తను ఎంతో పద్దతిగా, సాంప్రదాయబద్దంగా ఉందని.. తను తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవచ్చని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆమెకు సంగీతంపై ఆసక్తి ఉన్నట్లు తెలిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.