
బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు కలిసి ఆడుతున్న ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సీజన్ మొదలై 5 రోజులవుతుంది. హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ అందరూ తమ ఆటను మొదలు పెట్టేశారు. మొదటి వారం ఎవరుఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు. బిగ్ బాస్ మెయిన్ షో తోపాటు బిగ్ బాస్ బజ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ఓ మాజీ కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ పేరుతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను రకరకాల ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. అలాగే హౌస్ లో కన్నింగ్ ఎవరు.? స్ట్రాంగ్ ఎవరు.? ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.? హౌస్ లో చేసిన తప్పులేంటి.? ఇలా ఎన్నోరకాల ప్రశ్నలు అడుగుతారు. అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ బజ్ కోసం శివాజీని రంగంలోకి దింపారు. నటుడు శివాజీ ఈసారి బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సీజన్-8లో అర్జున్ అంబటి హోస్ట్ గా చేశాడు.
9 మంది సెలబ్రిటీలు ఉంటే, 6 మంది కామనర్స్ ఉన్నారు. మొదటి వారం ఎలిమినేట్ అయిన వారిని శివాజీ బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ చేయనున్నారు. గత కొద్దీ రోజులుగా బిగ్ బాస్ బజ్ కు శివన్న హోస్ట్ గా వ్యవహరిస్తాడు అని ప్రచారం జరుగుతుంది. అనుకున్నట్టుగానే శివాజీని రంగంలోకి దింపారు. సీజన్ 7లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అదరగొట్టాడు శివాజీ. ఇక శివన్న.. లేటెస్టుగా వచ్చిన బిగ్ బాస్ బజ్ ప్రోమోలో తనదైన శైలి డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ పేరుతో ఈ షో జరగనుంది. మరి శివాజీ బిగ్ బాస్ బజ్ తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.