ప్రేమగా బిగ్ బాస్ షోకు పంపాడు.. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్
తెలుగులోనూ బిగ్ బాస్ ఏడూ సీజన్స్‌తో పాటు ఓ ఓటీటీ వర్షన్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే తన భర్త తనను బిగ్ బాస్ హౌస్ కు పంపి వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపి షాక్ ఇచ్చింది ఓ కంటెస్టెంట్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత దాదాపు 110 రోజులవరకు కుటుంబ సభ్యులతో సంబంధం ఉండదు.. బయట ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు..

బి బాస్ షోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. చాలా మందికి బిగ్ బాస్ పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ తో పాటు సినిమాల్లో ఛాన్స్ లు కూడా వచ్చాయి. చాలా భాషల్లో ఈ గేమ్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తెలుగులోనూ బిగ్ బాస్ ఏడు సీజన్స్‌తో పాటు ఓ ఓటీటీ వర్షన్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే తన భర్త తనను బిగ్ బాస్ హౌస్ కు పంపి వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపి షాక్ ఇచ్చింది ఓ కంటెస్టెంట్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత దాదాపు 110 రోజులవరకు కుటుంబ సభ్యులతో సంబంధం ఉండదు.. బయట ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు.. ఇప్పుడు అదే తన కాపురం కూల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఇంతకు ఎం జరిగిందంటే..
బిగ్ బాస్ షో వల్ల చాలా మంది జీవితాలు మారిపోయాయి.. అలాగే ఈ అమ్మడి జీవితం మరో రకంగా మారిపోయింది. ఈ చిన్నదాని పేరు ఆర్య . మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సీరియల్స్ లో నటించిన ఆర్య ఆతర్వాత సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది. ఈ క్రమంలోనే మలయాళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆ షో నుంచి తిరిగి వచ్చే సరికి తన భర్త తనను వదిలేశాడని తెలిపింది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్య మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపింది. అలాగే తన భర్తతో విడిపోవడానికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చింది. ” వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్‌కి పంపాడా అనే అనుమానం నాకు ఉంది. నేను బిగ్ బాస్ షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చింది అతనే. నాకు ఓ కూతురు ఉంది. ఆ సమయంలోనే మా నాన్న గారు చనిపోయారు. ఆసమయంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు. చాలా రోజుల తర్వాత నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాను కానీ అతను అడ్రస్ లేడు. చాలా సార్లు ఫోన్ చేశా కానీ లిఫ్ట్ చేయలేదు.. ఆ తర్వాత నా సోదరికి కాల్ చేస్తే అప్పుడు తెలిసింది. అతను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని.. ఆ సమయంలో అతను దుబాయ్ లో ఉన్నాడు కోవిడ్ కారణంగా నేను అక్కడికి ఆ సమయంలో వెళ్లలేక పోయాను.. అప్పుడు అతన్ని చంపాలన్న కోపం వచ్చింది.. కానీ ఇప్పుడు ఆ కోపం లేదు.. కానీ అతనికి ఏదైనా చేడు జరిగితే మాత్రం సంతోషిస్తా అని తెలిపింది ఆర్య.
ఆర్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
