Skanda: స్కంద నుంచి హై ఓల్టేజ్ ఎనర్జిటిక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన రామ్, శ్రీలీల
చివరిగా వచ్చిన వారియర్ సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది దణ్డతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు రామ్. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు స్కంద అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ , మోస్ట్ హ్యపినింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ రామ్ కు సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరిగా వచ్చిన వారియర్ సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది దణ్డతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు రామ్. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు స్కంద అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ , మోస్ట్ హ్యపినింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ పై స్పీడ్ పెంచారు మేకర్స్.
ఈ క్రమంలోనే స్కంద మూవీనుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేశారు. నీ చుట్టూ చుట్టూ అంటూ సాంగ్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సాంగ్ లో రామ్, శ్రీలీల డాన్స్‌తో అదరగొట్టారు. రామ్ చాలా రోజుల తర్వాత మరోసారి డాన్స్ తో కుమ్మేశాడని చెప్పాలి. అలాగే శ్రీలీల కూడా తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ సాంగ్ కు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు రామ్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాతో పాటు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు రామ్.