Shaakuntalam: సమంత శాకుంతలం నుంచి అందమైన గానం.. ఆకట్టుకుంటోన్న పాట

|

Jan 18, 2023 | 8:19 PM

ఇటీవలే తెలుగులో యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది.

Shaakuntalam: సమంత శాకుంతలం నుంచి అందమైన గానం.. ఆకట్టుకుంటోన్న పాట
Samantha
Follow us on

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. టాప్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇటీవలే తెలుగులో యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమా హిస్టారికల్ మూవీగా రానుంది. సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.. దీని ఆధారంగా  భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా రూపొందిస్తున్న చిత్రం ‘శాకుతలం’. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. శాకుంత‌లం కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

తాజాగా శాకుంతలం నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు. సింగర్ రమ్యబెహరా ఆలపించిన ఈ అందమైన పాట ఆకట్టుకుంటోంది. మల్లికా మల్లికా అంటూ సాగే ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో దుర్వాస మునిగా మంచు మోహన్ బాబు.. అల్లు అర్జున్ తనయ అల్లు అర్ష ప్రిన్స్ భారతగా నటిస్తున్నారు.

ముందుగా నవంబర్ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని ప్రకటించారు అయితే ఆ తర్వాత విడుదలను వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకులను అలరించనుంది అందుకే ఈ ఆలస్యం అని ఆమధ్య మేకర్స్ వివరించారు.

ఇవి కూడా చదవండి