Byreddy Siddharth Reddy: హైపర్ ఆదికి తన మార్క్ కౌంటర్ ఇచ్చిన బైరెడ్డి.. సిద్దార్థ్ రెడ్డా మజాకా
నాలుగు మాటలు పడేందుకు సిద్ధమైతేనే పాలిటిక్స్‌లో ప్రత్యర్థిని ఒక్క మాట అనాలి. మళ్లీ వాళ్లు అనే ఆ నాలుగు మాటలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అన్నిసార్లు ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎవరినో టార్గెట్ చేసి అన్న మాటల బూమర్యాంగ్ అయి అసలుకే ఎసరు పెట్టవచ్చు.
రణస్థలం సభలో హైపర్ ఆది సంధించిన ప్రశ్నకు YCP నేత, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన మార్క్ కౌంటర్ ఇచ్చారు. పవన్, నాగబాబు ముందు గొప్ప అనిపించుకునేందుకు, ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించినట్టుగా ఆది మాటలున్నాయని సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏదైన మాట మాట్లాడే ముందు ఎవరి కింద తాము పనిచేస్తున్నామో చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పవన్ కల్యాణ్, నాగబాబు ముందు హైపర్ ఆది ఇచ్చిన పంచులను YCP తేలిగ్గా తీసుకుంటోంది. ఆ మాటలకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదని మంత్రి రోజా కుండబద్ధలు కొట్టారు. ఆది నోటి ఆ మాటలు వచ్చాయంటే దాని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చని రోజా అన్నారు.
ఆది పంచ్‌లపై ఇప్పటికే ఫేస్‌బుక్‌లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆర్మీ పేరుతో సెటైర్లు పేలుతున్నాయి. హైపర్ ఆదిగాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చిందంటూ సాగుతున్న ఈ సెటైర్లలో ఆది ఫోన్ నెంబర్ అంటూ ఒక నెంబర్ కూడా ఇచ్చి ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో మాటల దాడిని కూడా YCP తీవ్రతరం చేసింది. ఆది కాదు ఏకంగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.
మొత్తానికి ఆది హైపర్ కామెంట్స్‌కు YCP ప్రాపర్ రియాక్షన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఆది నెక్ట్స్ స్టెప్ ఏంటి? ఆదికి సపోర్టుగా జనసేన నాయకులు ఎవరైనా రంగంలోకి దిగుతారా? ప్రస్తుతానికి మాత్రం అలాంటిదేమి కనిపించడం లేదు. ఏది ఏమైనా ఇదంతా చూస్తుంటే ఈట్ కా జవాబ్ పత్తర్‌సే అన్నట్టుగా ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..