AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puttaparthi: గుప్త నిధుల కోసం తవ్వకాలు.. అదుపులోకి తీసుకుని విచారించిగా.. మరో సంచలన నిజం

గుప్త నిధుల కోసం పూజల చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ విచారణలో మరో సంచలన నిజం వెలుగుచూసింది.

Puttaparthi: గుప్త నిధుల కోసం తవ్వకాలు.. అదుపులోకి తీసుకుని విచారించిగా.. మరో సంచలన నిజం
Treasure Hunt
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2023 | 9:37 PM

Share

దొంగ బాబాలు.. సచ్చు సన్నాసులు.. విశ్వాసాల ముసుగులో బురిడీలు.. ఇట్టాంటి బ్యాచ్‌లది ఓ కథ… ఇదిగో ఇప్పుడు చెప్పబోయే గ్యాంగ్‌ మరో రకం…. వారివి గుడి ఎనక నా సామీ కతలైతే.. వీళ్లది మాత్రం గుళ్లను గుళ్లో లింగాలను పెకిలించడమే దందా.. గుప్త నిధుల కోసం క్షుద్రపూజల తంతు మొదలెట్టారు. కానీ సత్యసాయి జిల్లా పోలీసుల అప్రమత్తతో ఈ కేటుగాళ్ళ కథ అడ్డం తిరిగింది. పుట్టపర్తి జిల్లా వంకరకుంటలో వీరు క్షుద్రపూజలు చేశారు. నిమ్మకాయలు, మేకలు, పిండిముద్దలు, ఫోటోలు పడాల్సిన కథలు అన్నీ పడ్డారు.

ఖమ్మంకు చెందిన నిజామాముద్దీన్‌ బాబా సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను ఇంటరాగేట్‌ చేస్తే.. మరో సంచలన నిజం సైతం వెలుగుచూసింది.  ప్రకాశ్‌ అనే మాజీ కానిస్టేబల్‌ హత్యకు పన్నిన కుట్ర తెరపైకి వచ్చింది.  డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ ప్రకాష్ భార్య నాగమణి సహకారంతోనే అతని హత్యకు కుట్ర పన్నారు ఈ కేటుగాళ్లు. ప్రధాన నిందితుడు నిజాముద్దీన్ సహా 9మంది నిందితులను అరెస్ట్ చేసి కటకటాల బాటపట్టించారు. పదేళ్లుగా రాష్ట్రంలో అనేక చోట్ల నిజాముద్దీన్‌ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తేలింది. వంకరకుంటలో రెండునెలలుగా గుప్త నిధుల వేట సాగిస్తుంది ఈ ముఠా. మొత్తం 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల నుంచి రాళ్లు పగలగొట్టే కెమికల్, పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దుండగులు హత్య చేయాలని భావించిన మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పోలీసులకు రావాల్సిన బకాయిల విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కాడు. ఆపై పలు కారణాల చేత అధికారులు డిస్మిస్ చేశారు. అప్పటి నుంచి పోలీస్ శాఖపై, ప్రభుత్వంపై వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నాడు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..