Andhra Pradesh: ఏపీలో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారా..? రైతులకు క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్..
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసినట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయలేదని.. ఇదంతా దుష్ప్రచారం అంటూ కొట్టిపడేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసినట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయలేదని.. ఇదంతా దుష్ప్రచారం అంటూ కొట్టిపడేసింది. కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపేసిందని, దీనికి సంబంధించిన యాప్ పని చేయడం లేదంటూ పలు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వరి సేకరణకు సంబంధించి పూర్తిగా తప్పుడు వార్తలు ప్రచురితమవుతున్నాయని ప్రకటించింది. ఇదంతా అబద్దపు ప్రచారం అని.. ధాన్యం కొనుగోలు ను ఏ జిల్లాలోనూ నిలిపివేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేసింది. ప్రతిజిల్లాలో రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న రైతుల వద్ద నుంచి పూర్తిగా ధాన్యాన్ని సేకరించిన తర్వాతే, ఆ ప్రాంతంలో ధాన్యం నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే అక్కడ సేకరణ ప్రక్రియను ముగించనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.వీరపాండియన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక క్రమ పద్ధతిలో వరి కొనుగోళ్లు కొనసాగుతున్నాయని.. ఏ విధమైన అడ్డంకులు లేవని.. ఆపడం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. దుష్ప్రచారం చేస్తున్న కథనాల్లో నిజం లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరిని పూర్తిగా కొనుగోలు చేస్తుందని.. ఈ విధంగా రైతులకు భరోసా ఇస్తున్నట్లు వివరించారు. RBKల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉందని.. గ్రామ స్థాయిలో ఏదైనా అధికారిక ప్రకటన వారంలోపు సేకరణ విషయాన్ని ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఫేక్ వార్తలను నమ్మవద్దంటూ సూచించింది.
ప్రక్రియ ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీ ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత, ప్రస్తుత ప్రభుత్వాలు సేకరించిన ధాన్యం వివరాలు, సంబంధిత ఖర్చుల గురించి ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..