Tollywood : ఓవర్ నైట్ లో క్రేజ్ రావడం గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం.. కొంతంమంది సినిమా తారలు మాత్రం టీవీషోలతోనో లేక వివాదాస్పద వ్యాఖ్యలతోనో హైలైట్ అవుతూ ఉంటారు. పై ఫొటోలో కనిపిస్తన్న ముద్దుగుమ్మ పేరు కూడా రీసెంట్ డేస్ లోబాగా వినిపించింది. సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ రాని పాపులారిటీ ఒక్క రియాలిటీ షోతో సొంతం చేసుకుంది ఈ భామ. మాస్క్ మాటున దాగున్న ఆ అందం ఎవరో గుర్తుపట్టారా..? సరదాగా చేప పట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చిన ఈ బ్యూటీని గుర్తుపట్టడం అంత కష్టమేమి కాదు. ఈ అమ్మడు తెలుగమ్మాయే.. అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది చేసిన సినిమాలు తక్కువే.. చాలా కాలం తర్వాత రీసెంట్ గా ఓ రియాలిటీ షోలో పాల్గొని పాపులర్ అయ్యింది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..
తెలుగులో బిగ్ బాస్ ఇప్పటివరకు 5 సీజన్లు పూర్తి చేసుకుంది. అలాగే రీసెంట్ గా నాన్ స్టాప్ అంటూ ఓటీటీలోనూ సందడి చేసింది. అయితే పై ఫొటోలో కనిపిస్తోన్న బ్యూటీ ఎవరో కాదు. బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి. తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే అక్కడ కమల్ హాసన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ లోనూ పాల్గొంది. ఆ తర్వాత బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లో పాల్గొంది. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకొని బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో ఆఫర్లు అందుకుంటోంది.ప్రస్తుతం బిందు మాధవి పలు వెబ్ సిరీస్ లతోపాటు సినిమాల్లోనూ నటిస్తుందని తెలుస్తోంది.