RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు మరో తలనొప్పి.. రాజమౌళికి నోటీసులు పంపిన అల్లూరీ ఫ్యామిలీ.. ఎందుకంటే..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు మరో తలనొప్పి.. రాజమౌళికి నోటీసులు పంపిన అల్లూరీ ఫ్యామిలీ.. ఎందుకంటే..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2022 | 7:54 AM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‍తో అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్‏ల స్నేహాన్ని వెండితెరపై చూసేందుకు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ దేశంలో ఓమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో మెగా, నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు.

పాన్ ఇండియా వ్యాప్తంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు జక్కన్న. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఆర్ఆర్ఆర్ టీం వరుస ఇంటర్వ్యూలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటూ సందడి చేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఓమిక్రాన్ గట్టిగానే దెబ్బకొట్టింది. తాజాగా ఈ భారీ బడ్జె్ట్ చిత్రానికి మరో తలనొప్పి వచ్చి చేరింది. రాజమౌళి సినిమాకు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో జక్కన్నకు నోటీసులు కూడా పంపారు. ఇంతకీ.. ఆ నోటిసులు ఎవరు పంపారు ? ఎందుకు పంపాల్సి వచ్చిందో ? తెలుసుకుందామా.

ఆర్ఆర్ఆర్ సినిమా అల్లూరి సీతారామరాజు చరిత్రని వక్రీకరించినట్టు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అల్లూరి వంశస్తులు. ప్రభుత్వ అరాచకానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిని, బ్రిటిష్ ప్రభుత్వాకి అనుకూలంగా పనిచేసే పోలీస్ పాత్రలో చూపించడం ఏంటని, ఇది చరిత్రను వక్రీకరించడమే అవుతుందనేది అల్లూరి వారి వాదన. ఈ విషయం పై RRR మూవీ తోపాటు సెన్సార్ బోర్డుకి నోటీసు పంపారు అల్లూరి సౌమ్య తరపు న్యాయవాది. బ్రహ్మచారిగా ఉన్న అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న పాత్రకు, సినిమా ట్రైలర్‌లో సీత అనే పాత్రతో డ్యూయెట్ సాంగ్, సన్నిహితంగా ఉన్న సన్నివేశాలు పెట్టడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

అయితే, పాన్ ఇండియా సినిమాలో ఇలాంటి పొరపాట్లు సరికాదని అంటున్నారు లాయర్ రత్నం. భవిష్యత్తు తరాలకి తప్పుడు సమాచారం అందించడనే అవుతుందని వాదిస్తున్నారు అడ్వకేట్ రత్నం. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దని.. విడుదలపై స్టే విధించాలని కోరారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందుకు ఈ పిల్‌ విచారణకు వచ్చింది.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..