Faria Abdullah: ఒక అడ్వంచర్‌లా సాగిన సినిమా ఇది.. ఫరియా అబ్దులా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా అబ్దులా నటన ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించింది. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. ఈ బ్యూటీ సినిమా అవకాశాలు త్వరగా రాలేదు.

Faria Abdullah: ఒక అడ్వంచర్‌లా సాగిన సినిమా ఇది.. ఫరియా అబ్దులా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faria Abdullah

Updated on: Oct 24, 2022 | 7:51 AM

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ బ్యూటీ గా మారిపోయింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దులా. నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫరియా అబ్దులా. తొలి సినిమాతోనే అందం, అమాయకత్వం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా అబ్దులా నటన ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించింది. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. ఈ బ్యూటీ సినిమా అవకాశాలు త్వరగా రాలేదు. ఇక ఈ అమ్మడుహీరోయిన్ గానే కాదు ఇతర హీరోల సినిమాలో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అలాగే కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో  స్పెషల్ సాంగ్ కోసం ఫరియాను ఎంపిక చేసుకున్నారు.. నిజానికి ఫరియా మంచి డాన్సర్. హిఫ్‌ హాప్, బీ బాయింగ్, బెల్లీ డాన్స్ లలో ఆమె ట్రైనింగ్ తీసుకుంది.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు లైక్ , షేర్, సబ్‌స్క్రైబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. లైక్ షేర్ , సబ్‌స్క్రైబ్ జర్నీ ఒక అడ్వంచర్ లా జరిగింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. హారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ కి థాంక్స్ చెప్పింది.

అలాగే సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీకి కృతజ్ఞతలు. బ్రహ్మాజీ తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ వున్నాను. నవంబర్ 4న సినిమా విడుదల కాబోతుంది. నా మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ ని ఆదరించినట్లే ఈ సినిమాకి కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే స్టోరీని గాంధీ గారు చెప్పినపుడు చాలా మంచి ఫీలింగ్ కలిగిందని.. అందు వల్లే ఈ సినిమా చేయడానికి తాను ఒప్పుకున్నానని ఫరియా అబ్దుల్లా పేర్కొంది.

ఇవి కూడా చదవండి