AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh : ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

అలాగే మల్టీస్టారర్ సినిమాలంటే చాలు ముందుంటారు వెంకీ. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో మల్టీస్టారర్ సినిమాలు చేశారు ఈ సీనియర్ హీరో. రీసెంట్ గా ఎఫ్ 3 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు.

Venkatesh : ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2022 | 8:03 AM

Share

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీపడుతూ బ్యాక్ టు  బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వెంకీ. అలాగే మల్టీస్టారర్ సినిమాలంటే చాలు ముందుంటారు వెంకీ. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో మల్టీస్టారర్ సినిమాలు చేశారు ఈ సీనియర్ హీరో. రీసెంట్ గా ఎఫ్ 3 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు వెంకటేష్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ ఈ సిరీస్‏ను నిర్మిస్తోంది. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రాబోతున్న సిరీస్‏లో వీరిద్దరు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో నటించారు వెంకీ.

ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఓ మై కడవలె సినిమాను తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టించిన‌ చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యాన‌ర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో న‌టించారు. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేశారు. సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించిన వెంకటేష్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో వెంకీ చిన్న పాత్రలోనే కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం మొత్తం ఐదు రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చారట వెంకీ. దానికి తగ్గట్లుగానే దర్శకనిర్మాతలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఐదు రోజుల డేట్స్ కోసం వెంకీకి రూ.3 కోట్లు చెల్లించారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
Follow Us
వర్షాకాలంలో ఇలాంటి చేపలు తింటే మీ పని అయిపోయినట్లే..
వర్షాకాలంలో ఇలాంటి చేపలు తింటే మీ పని అయిపోయినట్లే..
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
కర్తవ్యం 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
ఏం కొడుతున్నావ్ అక్క! మేస్ట్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
బ్యాచిలర్స్ కూడా మెచ్చే ఈజీ చికెన్ సుక్కా.. వండితే ప్లేట్ ఖాళీ
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు శాస్త్రం..
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి, చిరంజీవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్..
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!
కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!