Sitara Ghattamaneni: సితారపై గులాబీల వర్షం.. అభిమానులతో కలిసి గుంటూరు కారం చూసిన మహేష్ తనయ..
ముఖ్యంగా చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ హీరోగా అదరగొట్టారు మహేష్. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచే థియేటర్ల వద్ద సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాను అభిమానులతో కలిసి చూసేందుకు సూపర్ స్టార్ హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MMకి ఫ్యామిలీతో కలిసి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. తమ అభిమాన హీరో రాకతో ఫ్యాన్స్ ఎంతో ఉప్పొంగిపోయారు.

సంక్రాంతి పండగ సందడిని ముందే తీసుకోచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఈరోజు (జనవరి 12న) గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే అంచనాలు పెంచేసిన ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ హీరోగా అదరగొట్టారు మహేష్. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచే థియేటర్ల వద్ద సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాను అభిమానులతో కలిసి చూసేందుకు సూపర్ స్టార్ హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MMకి ఫ్యామిలీతో కలిసి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. తమ అభిమాన హీరో రాకతో ఫ్యాన్స్ ఎంతో ఉప్పొంగిపోయారు.
మహేష్ తోపాటు నమ్రత, సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం సుదర్శన్ థియేటర్ కు వచ్చారు. మహేష్ ఫ్యామిలీ థియేటర్ లోపలికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న అభిమానులు గులాబీల వర్షం కురిపించారు. సితార, మహేష్ పై గులాబీలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram
2005లో వచ్చిన అతడు, 2010లో వచ్చిన ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ సినిమా ఇదే. ఇందులో శ్రీలీల, జగపతి బాబు, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ సంగీతం అందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ ప్రమహంస ఈ చిత్రానికి కెమెరా క్రాంక్ చేయగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
Superstar @UrstrulyMahesh and family watched #GunturKaaram with fans today at Sudarshan 35MM 🔥
The response and the love they received are truly electrifying 💥🤟🏻#BlockbusterGunturKaaram 🌶️#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli… pic.twitter.com/PkY3EcPQc6
— BA Raju’s Team (@baraju_SuperHit) January 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




