- Telugu News Photo Gallery Cinema photos Will Director Shankar get box office success in his next 3 upcoming movies
Shankar: ఏడాది గ్యాప్‌లో 3 సినిమాలు.. వీటితో శంకర్ దశ తిరుగుతుందా ??
శంకర్ కెరీర్‌కు చరమాంకమానికి చేరుకుంటుందా లేదంటే కొత్తగా మొదలవుతుందా..? ఒకప్పుడు ఇండియన్ సినిమా రికార్డులతో చెడుగుడు ఆడుకున్న ఈయనకిప్పుడు కాస్త టఫ్ టైమ్ నడుస్తుంది. శంకర్ ఈజ్ బ్యాక్ అని చెప్పాలంటే కచ్చితంగా బ్లాక్‌బస్టర్స్ కొట్టాల్సిందే. ఇలాంటి సమయంలో ఏడాది గ్యాప్‌లో 3 సినిమాలతో రానున్నారు శంకర్. మరి వీటితో ఆయన దశ తిరుగుతుందా..? రాజమౌళి కంటే ముందే సౌత్ ఇండస్ట్రీ పేరును బాలీవుడ్‌లో మోగించిన దర్శకుడు శంకర్.
Updated on: Jan 12, 2024 | 7:33 PM

శంకర్ కెరీర్‌కు చరమాంకమానికి చేరుకుంటుందా లేదంటే కొత్తగా మొదలవుతుందా..? ఒకప్పుడు ఇండియన్ సినిమా రికార్డులతో చెడుగుడు ఆడుకున్న ఈయనకిప్పుడు కాస్త టఫ్ టైమ్ నడుస్తుంది. శంకర్ ఈజ్ బ్యాక్ అని చెప్పాలంటే కచ్చితంగా బ్లాక్‌బస్టర్స్ కొట్టాల్సిందే. ఇలాంటి సమయంలో ఏడాది గ్యాప్‌లో 3 సినిమాలతో రానున్నారు శంకర్. మరి వీటితో ఆయన దశ తిరుగుతుందా..?

రాజమౌళి కంటే ముందే సౌత్ ఇండస్ట్రీ పేరును బాలీవుడ్‌లో మోగించిన దర్శకుడు శంకర్. భారీ బడ్జెట్ చిత్రాలకి ఈయన కేరాఫ్ అడ్రెస్. దాంతో పాటు విజయాలు కూడ అలాగే వచ్చాయి. హిట్స్ వచ్చినపుడు ఏం చేసినా ఓకే.. కానీ శంకర్ టైమ్ ఇప్పుడు అస్సలు బాగోలేదు. రోబో తర్వాత ఆయనకు సక్సెస్ లేదు.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఐ, 2.0 సినిమాలు నష్టాలనే తీసుకొచ్చాయి.

2.0 తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న శంకర్.. ఒకేసారి మూడు సినిమాలతో రాబోతున్నారిప్పుడు. ఓ వైపు కమల్ హాసన్ ఇండియన్ 2 తెరకెక్కిస్తూనే.. మరోవైపు చరణ్‌తో గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఈ రెండింటి షూటింగ్ ఒకేసారి చేస్తున్నారు శంకర్. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 టీజర్ అప్ టూ ది మార్క్ లేదనే టాక్ వచ్చింది. 2024 సమ్మర్ తర్వాత భారతీయుడు 2 రానుంది.

ఇండియన్ 2ను రెండు భాగాలుగా చేయాలనుకుంటున్నారు శంకర్. ఈ లెక్కన 2024 సమ్మర్‌లో పార్ట్ 2 వస్తే.. 2025 సంక్రాంతికి ఇండియన్ 3 ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు 2024 సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్ రానుంది.

ఈ చిత్ర షూటింగ్ కూడా చివరికి వచ్చేసింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. 2024 సమ్మర్ టూ 2025 సంక్రాంతి మధ్య.. అంటే 10 నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో రానున్నారు శంకర్. వీటితో ఆయన జాతకం తేలిపోనుంది.




