- Telugu News Photo Gallery Cinema photos Director Nag Ashwin has revealed an interesting news about the shooting of Kalki 2898 AD
Kalki 2898 AD: కల్కి నుంచి ఇంట్రస్టింగ్ రివీల్.. నాగ్ అశ్విన్ మరో రాజమౌళి అంటున్న జనాలు..
సలార్ సక్సెస్‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు ప్రభాస్. దీంతో డార్లింగ్ హీరోగా రూపొందుతున్న నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. దీంతో టాలీవుడ్‌కి మరో రాజమౌళి దొరికాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సలార్ సక్సెస్ జోష్‌లో ఉన్న డార్లింగ్ అభిమానులను ఊరిస్తున్న మరో మూవీ కల్కి 2898 ఏడీ.
Updated on: Jan 12, 2024 | 4:40 PM

సలార్ సక్సెస్ జోష్‌లో ఉన్న డార్లింగ్ అభిమానులను ఊరిస్తున్న మరో మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సెటప్‌ను సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఫ్యూచర్‌లో జరిగే కథ కావటంతో అందుకు తగ్గ ఎట్మాస్పియర్‌ను సెటప్ చేసేందుకు చాలా కష్టపడుతున్నారు.

ఫ్యూచర్‌లో ఎలాంటి వెహికల్స్ రావొచ్చు, ఎలాంటి వెపన్స్ యూజ్ చేయోచ్చు అన్న ఆలోచనలో కొన్ని డిజైన్స్ రెడీ చేశారు. వాటిని రెడీ చేయటానికే ఎక్కువ టైమ్ తీసుకుంటోంది యూనిట్. అదే విషయాన్ని రివీల్ చేసిన దర్శకుడు... సినిమా మేకింగ్ కన్నా ఇంజనీరింగ్ వర్క్ వల్లే ఎక్కువ డీల్ అవుతుందని అసలు విషయం బయటపెట్టారు.ఫ్యూచర్‌లో ఎలాంటి వెహికల్స్ రావొచ్చు, ఎలాంటి వెపన్స్ యూజ్ చేయోచ్చు అన్న ఆలోచనలో కొన్ని డిజైన్స్ రెడీ చేశారు. వాటిని రెడీ చేయటానికే ఎక్కువ టైమ్ తీసుకుంటోంది యూనిట్. అదే విషయాన్ని రివీల్ చేసిన దర్శకుడు... సినిమా మేకింగ్ కన్నా ఇంజనీరింగ్ వర్క్ వల్లే ఎక్కువ డీల్ అవుతుందని అసలు విషయం బయటపెట్టారు.

ప్రీ ప్రొడక్షన్ విషయంలో నాగ్ అశ్విన్ తీసుకుంటున్న కేర్ చూసి టాలీవుడ్‌కు మరో రాజమౌళి దొరికేశాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సాధారణంగా మూవీ మేకింగ్ విషయంలో ఇంత పర్టిక్యులర్‌గా ఉండే దర్శకులు చాలా అరుదు.

సెట్, కాస్ట్యూమ్, ఆర్టిస్ట్‌ల పెర్ఫామెన్స్ ఇలా ప్రతీ విషయంలో అనుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు రాజమౌళి వదిలిపెట్టరన్న పేరుంది. అందుకే జక్కన్న సినిమా అంటే ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అలాగే తయారయ్యారంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

కల్కి సినిమా కోసం ఏళ్ల తరబడి వర్క్ చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువగా ప్రీ ప్రొడక్షన్ మీదే టైమ్ కేటాయిస్తున్నారు. దీంతో సినిమా అవుట్‌పుట్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ అభిమానుల్లోనూ కనిపిస్తోంది. తాజాగా శుక్రవారం ఈ మే 9న ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టనున్నట్లు తెలిపారు.




