మార్చిలో కూడా ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మార్చి 8న రిలీజ్ అవుతోంది. విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అదే డేట్‌కు రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్ దేవర పార్ట్ 1ను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ ఆల్రెడీ డేట్ లాక్ చేసింది యూనిట్.