Balakrishna: 2023 హిట్ అందుకున్న స్టార్స్.. బాలయ్య సినిమాతో 2024లో బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధం అయ్యారా.?
లాస్ట్ ఇయర్ సక్సెస్‌లున్నవాళ్లందరూ కలిసి ఒక సినిమా చేసి 2024లో బాక్సాఫీస్ మీద దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నుంచి కెప్టెన్, హీరో మేం రెడీ అంటే, నార్త్ నుంచి ఓ గ్లామర్ బ్యూటీతో కలిసి విలన్ ట్రావెల్ స్టార్ట్ చేశారు. ఇంతమందిని చూశాక అంచనాలు మామూలుగా ఉంటాయా చెప్పండి.... స్కై ఈజ్ ద లిమిట్ అంటున్నారు ఆడియన్స్. 2023 సంక్రాంతిని వాల్తేరు వీరయ్యతో పాజిటివ్‌గా స్టార్ట్ చేశారు బాబీ. ఆ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన వెంటనే బాలయ్యతో మూవీ ప్లాన్ చేశారు బాబీ.
Updated on: Jan 12, 2024 | 4:52 PM

లాస్ట్ ఇయర్ సక్సెస్‌లున్నవాళ్లందరూ కలిసి ఒక సినిమా చేసి 2024లో బాక్సాఫీస్ మీద దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నుంచి కెప్టెన్, హీరో మేం రెడీ అంటే, నార్త్ నుంచి ఓ గ్లామర్ బ్యూటీతో కలిసి విలన్ ట్రావెల్ స్టార్ట్ చేశారు. ఇంతమందిని చూశాక అంచనాలు మామూలుగా ఉంటాయా చెప్పండి.... స్కై ఈజ్ ద లిమిట్ అంటున్నారు ఆడియన్స్.

2023 సంక్రాంతిని వాల్తేరు వీరయ్యతో పాజిటివ్‌గా స్టార్ట్ చేశారు బాబీ. రైటర్ కమ్ డైరక్టర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు బాబీ. ఆయన డైరక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ చేసిన వాల్తేరు వీరయ్యను జనాలు మంచి మార్కులతో పాస్ చేశారు. ఆ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన వెంటనే బాలయ్యతో మూవీ ప్లాన్ చేశారు బాబీ.

ప్రస్తుతం బాబీ సెట్స్ లోనే ఉన్నారు సిల్వర్ స్క్రీన్ భగవంత్ కేసరి. లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో రెండు హిట్లు అందుకున్నారు నందమూరి నటసింహం బాలయ్య. ఈ సినిమా జోష్‌లోనే బాబీతో ప్రయాణం మొదలుపెట్టారు బాలయ్య. భగవంత్ కేసరిలో చూసిన గెటప్‌కీ, కేరక్టర్‌కీ, ఇప్పుడు 109లో కనిపించే బాలయ్యకీ పూర్తి కాంట్రాస్ట్ ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ మాట.

బాలయ్య సినిమాలో విలన్లకు ఎప్పుడూ పవర్‌ఫుల్ రోల్ ఉంటుంది. అంతటి పవర్ ఉంది కాబట్టే ఈ సారి యానిమల్ విలన్‌ని రంగంలోకి దింపారు మేకర్స్. జమల్ కుడు సాంగ్‌తో మాస్‌నీ, క్లాస్‌నీ వారెవా అంటూ మెప్పించిన బాబీ డియోల్ ఇప్పుడు 109లో నందమూరి నటసింహానికి విలన్‌గా నటిస్తున్నారు. ఆయన కేరక్టరైజేషన్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది.

2023లో బాసూ వేర్ ఈజ్‌ద పార్టీ అంటూ కుర్రకారు చేత స్టెప్పులేయించిన ఊర్వశి రౌతేలా కూడా ఇప్పుడు బాలయ్య సెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ ముంబై నుంచి ఊర్వశి, బాబీ డియోల్ కలిసి ట్రావెల్ చేస్తున్న పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.




