- Telugu News Photo Gallery Cinema photos Pan india Star Prabhas Next Movie Kalki 2898 AD Release date Update Telugu Heroes Photos
Prabhas – Kalki: ప్రభాస్ సలార్ సౌండ్ గట్టిగానే వినిపించిందిగా..! నెక్స్ట్ కల్కి ఎప్పుడంటే.?
సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు స్పీడు పెంచారు. సలార్ విషయంలో ఫ్యాన్స్ నుంచి వినిపించిన కంప్లైంట్స్‌ను కన్సిడర్ చేస్తూ అప్ కమింగ్ సినిమాల విషయంలో రూటు మార్చారు. ఇంతకీ ప్రభాస్‌లో వచ్చిన ఆ చేంజ్ ఏంటి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. బాహుబలి తరువాత చాలా రోజులకు సలార్ సినిమాతో మోస్ట్ నీడెడ్ హిట్ అందుకున్నారు ప్రభాస్. రిలీజ్‌కు ముందు సలార్‌కు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు.
Updated on: Jan 12, 2024 | 2:44 PM

Prabhas

సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు స్పీడు పెంచారు. సలార్ విషయంలో ఫ్యాన్స్ నుంచి వినిపించిన కంప్లైంట్స్‌ను కన్సిడర్ చేస్తూ అప్ కమింగ్ సినిమాల విషయంలో రూటు మార్చారు.

ఇంతకీ ప్రభాస్‌లో వచ్చిన ఆ చేంజ్ ఏంటి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. బాహుబలి తరువాత చాలా రోజులకు సలార్ సినిమాతో మోస్ట్ నీడెడ్ హిట్ అందుకున్నారు ప్రభాస్. రిలీజ్‌కు ముందు సలార్‌కు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు.

ఒకటి రెండు ఇంటర్వ్యూస్ తప్ప చిత్రయూనిట్ కూడా పెద్దగా బయటకు రాలేదు. అయినా సలార్ సూపర్ హిట్ అయ్యింది. ప్రమోషన్స్ భారీగా చేయకపోయినా.. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త కాన్సన్‌ట్రేట్ చేసి ఉంటే..,

అప్పుడు సక్సెస్ సౌండ్ నెక్ట్స్ లెవల్‌లో ఉండేది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే అప్ కమింగ్ సినిమాల విషయంలో అదే ప్లాన్‌లో ఉంది ప్రభాస్ టీమ్.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలను ముందు నుంచే ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యింది డార్లింగ్ టీమ్. సంక్రాంతి నుంచి నెక్ట్స్ సినిమాల ప్రమోషన్ మీద స్పెషల్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.

ఆల్రెడీ మారుతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రాబోతుందన్న ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ మీద కూడా ఫోకస్ పెంచింది డార్లింగ్ టీమ్. ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నా..

ఈ వారమే రిలీజ్ డేట్‌ను మే 9 న అనౌన్స్ చేశారు.. సలార్ సినిమాకు మిస్ అయిన ప్రమోషన్ హడావిడి, అప్ కమింగ్ సినిమాల విషయంలో డబుల్ చేసి చూపించాలని ఫిక్స్ అయ్యింది.




