Pournami Re Release: ఇదేం పిచ్చిరా అయ్యా! ‘పౌర్ణమి’ సీన్ రీ క్రియేట్.. తలపై దీపం పెట్టుకుని రచ్చ చేసిన అభిమాని
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అతను నటించిన క్లాసికల్ హిట్ పౌర్ణమి సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మరిన్ని హంగులు తీర్చిదిద్ది 4K వెర్షన్ లో గురువారం (అక్టోబర్ 23) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23) పురస్కరించుకుని గురువారం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పాన్ ఇండియా స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే అతను నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇదే సందర్భంగా ప్రభాస్ నటించిన క్లాసికల్ హిట్ ‘పౌర్ణమి’ సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. మరిన్ని హంగులు తీర్చిదిద్ది 4K వెర్షన్ లో గురువారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంగా కొందరు అభిమానులు పౌర్ణమి సినిమాలోని కొన్ని సూపర్ హిట్ సీన్స్ ను రీక్రియేట్ చేశారు .ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే భరత వేదముగ పాటలో హీరోయిన్ చార్మీ రెండు చేతులలో, తలపైన దీపం వేలిగించుకొని డాన్స్ చేసే సీన్ ను రీ క్రియేట్ చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. థియేటర్లలో ఇలాంటి పనులు మంచిది కాదని, అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.
డ్యాన్స్ మాస్టర్, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన పౌర్ణమి సినిమా 2006లో రిలీజై క్లాసికల్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ సరసన త్రిష, ఛార్మీ, సింధు తులానీ హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడీ మూవీ ప్రస్తుతం 4K ఫార్మాట్‌లో రీమాస్టర్డ్ అయ్యి, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగానే అభిమానులు ప్రభాస్ కు హారతులు పడుతూ సందడి చేస్తున్నారు. అలాగే డార్లింగ్ చిత్ర పటాలు, ఫొటోలు పట్టుకుని ఈలలు, కేకలు వేస్తూ నానా హంగామా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
దీపం నెత్తిన పెట్టుకుని డ్యాన్స్ చేస్తోన్న ప్రభాస్ అభిమాని.. వీడియో..
#Pournami #Prabhas #happybirthdayprabhas#RebelStarBdayFest pic.twitter.com/WOTIOIpVSh
— tarun (@Bk_Tarun7) October 23, 2025
థియేటర్లలో ప్రభాస్ కు హారతులు ఇస్తోన్న అభిమానులు.. వీడియో..
Many happy returns of the day #Prabhas Garu. Wishing you a fantastic year ahead. Take care & God bless#HappyBirthdayPrabhas #Pournami #HBDPrabhas #Pournami4K #Salaar #Eswar pic.twitter.com/oCtWpuGK1I
— Fauzi (@Vishwa0911) October 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




