AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నాళ్లకు కనిపించింది మావ..! ఖడ్గం సినిమా బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే..

చాలా మంది అందాలభామలు ఇలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకొని అలా వెళ్లిపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు. అప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చి ఇప్పుడు కనుమరుగైన ముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు అని నెటిజన్లు గూగుల్ ను గాలించేస్తోన్నారు. అలా గాలిస్తున్న హీరోయిన్స్ లో పై ఫొటోలో కనిపిస్తోన్న ముద్దుగుమ్మ ఒకరు.

ఎన్నాళ్లకు కనిపించింది మావ..! ఖడ్గం సినిమా బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే..
Khadgam Movie
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2025 | 6:28 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఖడ్గం ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఈ సినిమా కచ్చితంగా టీవీలో ప్రత్యక్షమైపోవాల్సిందే.  ఆగస్టు 15న స్కూల్స్, కాలేజీల్లో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఖడ్గం సినిమా పాటలు ఉండాల్సిందే. 2002లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ, సోనాలి బింద్రే, కిమ్ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇదే సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా నంది పురస్కారం అందుకున్నాడు కృష్ణ వంశీ. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారు సోనాలిబింద్రే, మరొకరు కిమ్ శర్మ. అప్పటికీ వీరిద్దరూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లే.

సోనాలి బింద్రే శ్రీకాంత్ ప్రియురాలిగా నటించగా, కిమ్ శర్మ మాత్రం శ్రీకాంత్ వెంట పడే అల్లరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ‘ముసుగు వేయద్దు మనసు మీద’ పాటలో కిమ్ శర్మ స్టెప్పులు అభిమానులను ఓ రేంజ్ లో అలరించాయి. ఖడ్గం తర్వాత రాజమౌళి- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీరలో ఓ స్పెషల్ సాంగ్‌లో కిమ్ స్టెప్పులేసింది. అలాగే రవితేజ ఆంజనేయలు సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. ఆఖరిగా యాగం అనే సినిమాలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ లోనూ 2011లో లూట్ అనే సినిమా తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు కిమ్ శర్మ. కిమ్ శర్మ అనగానే చాలా మందికి ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లవర్ అన్న ముద్ర పడింది. అయితే ఆమె 2010లో అనిల్ పుంజానీని పెళ్లి చేసుకుంది. అయితే ఈ దంపతులు 2016లో విడిపోయారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి