AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జాతకం చాలా బావుంది.. వీళ్లు లేకపోతే బిగ్ బాస్‌కు కంటెస్టెంట్స్ లేరన్న వేణు స్వామి

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన. ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.

మీ జాతకం చాలా బావుంది.. వీళ్లు లేకపోతే బిగ్ బాస్‌కు కంటెస్టెంట్స్ లేరన్న వేణు స్వామి
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2025 | 6:09 PM

Share

వేణు స్వామి.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో వార్తల్లో బాగా వైరల్ అయ్యారు వేణు స్వామి. ముఖ్యంగా సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు, ఎవరికీ ప్రమాదాలు జరుగుతాయి ఇలా రకరకాల విషయాలు చెప్పి నెట్టింట ట్రోల్స్ బారిన పడ్డారు వేణు స్వామి. ట్రోల్స్ ఎక్కువ కావడంతో ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా ఈ  స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇలా చిక్కుల్లో పడ్డ వేణు స్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు.

ఇక ఇప్పుడు మరోసారి ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ప్రముఖ గేమ్ షో బిగ్ బాస్ గురించి వేణు స్వామి ఓ వీడియో షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు వేణు స్వామి. ” తెలుగు రాష్ట్రాలు, తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియాలు అంటేనే కాంట్రవర్శీ.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియాలో నేనూ చూసిన విషయం బిగ్‌బాస్ షోని బ్యాన్ చేయాలని.. అక్కడెక్కడో కంప్లెయింట్ కూడా ఇచ్చారట.. ఓకే అది వాళ్ల వ్యక్తిగతమైన అభిప్రాయం.. సరే బ్యాన్ చేయాలి కానీ బ్యాన్ చేయాలని చాలా మంది చెప్తున్నదానికి రీజన్స్ ఏంటంటే అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి.

ఇవి కూడా చదవండి

“రంకులు, బూతు ఆడియోలు, సీఎంని తిట్టే వాడు ఒకడు, మాజీ సీఎంని తిట్టేవాడు ఒకడు, డిప్యూటీ సీఎంని తిట్టేవాడు ఒకడు.. విచిత్రమైన విషయం ఏంటంటే భార్యభర్తలు విడిపోతారని జ్యోతిష్యం చెప్తే మీ మనోభావాలు దెబ్బతింటాయి కానీ మహాత్మా గాంధీని బండబూతులు తిడితే ఎవడి మనోభావాలు దెబ్బతినవు.. ఒక హీరోని పట్టుకొని బాడీ షేమింగ్ చేసే ప్రశ్నలు వేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవ్.. ఇదే నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో.. ఇలాంటి వాళ్లందరికీ బిగ్‌బాస్ టీమ్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి.. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొంతశాతం సోషల్ మీడియా, కొంతశాతం మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు ప్రతి సంవత్సరం బిగ్‌బాస్‌కి కంటెస్టెంట్లని తయారుచేసి ఇస్తుంది… వీళ్లు లేకపోతే బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లు లేరు.. ఇవాళ బిగ్‌బాస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో ఇంచుమించు ముగ్గురు కాంట్రవర్సీ, ఇద్దరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినవాళ్లు.. ఇలా రేపు వాళ్ల టీఆర్పీలు, వ్యూస్ కోసం మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా విమర్శించవచ్చు.. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి వీళ్లు టార్గెట్ చేస్తున్నారంటేనే మీ జాతకం చాలా బావుందని అర్థం.. మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్లబోతున్నారని అర్థం.. మీరు స్టార్ హీరోలు అయ్యే అవకాశం ఉంది.. మీరు కూడా 2026లో బిగ్‌బాస్‌లో కనిపించే అవకాశం ఉంది.. కాబట్టి ఈ ట్రోలింగ్‌కి, మీమ్స్‌కి అసలు భయపడకండి అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.