
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 గురువారం (అక్టోబర్ 02) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కాంతార ఛాప్టర్ 1 సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. బెంగళూరు సిటీలోని అంజనా థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది. కాంతారా సినిమా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి ఎలా అయితే పూనకాలతో ఊగిపోతాడో, అచ్చం అదే మాదిరిగా థియేటర్ బయట ఒక అభిమాని కూడా పూనకాలతో ఊగిపోయాడు. గట్టిగా అరుస్తూ చేతులు జోడించి నమస్కారం పెడుతూ పొర్లు దండాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. జెన్యూన్ గా ఇతనికి పూనకాలు వచ్చాయని కొందరు అంటుంటే, అందరి అటెన్షన్ కోసమే ఇలా నటిస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో కాంతారా సినిమాకు ఆదరణ పెరుగుతోంది. బుక్ మై షో లో కూడా టికెట్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సినిమాకు మొదటి రోజే భారీ కలెక్‌న్లు వచ్చే అవకాశముంది. కాగా సాంప్రదాయ నృత్యమైన భూత కోలా, పంజుర్లి వంటి దైవిక అంశాలతో కాంతార ఛాప్టర్ 1 తెరకెక్కింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించాడు రిషబ్ శెట్టి . రుక్మిణి వసంత్ కథానాయికగా మెప్పించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా నటించాడు.
After watching #KantaraChapter1 😯 pic.twitter.com/CN9sf8jAcz
— Filmy Fanatic (@FanaticFilmy) October 2, 2025
The response from Orion Mall, Bengaluru is incredible! Audiences are loving #KantaraChapter1 🔥
Experience the divine folklore saga, #BlockbusterKantara in theatres near you!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/RwICLZxOZ4
— Hombale Films (@hombalefilms) October 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.