Samantha: సమంతపై ప్రశంసలు కురిపించిన ఆ డైరెక్టర్స్.. ‘శాకుంతలం’ విజువల్ వండర్‏లా ఉందంటూ ట్వీట్..

|

Apr 14, 2023 | 12:05 PM

పాన్ ఇండియా లెవల్లో ఈరోజు విడుదలైన ఈ సినిమాపై ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రివ్యూ ఇచ్చారు. అంతేకాకుండా.. శాకుంతలం విజువల్ వండర్ అని.. ఈ సినిమాను సామ్ మొత్తం తన భూజాలపై తీసుకోచ్చిందని ట్వీట్ చేసారు.

Samantha: సమంతపై ప్రశంసలు కురిపించిన ఆ డైరెక్టర్స్.. శాకుంతలం విజువల్ వండర్‏లా ఉందంటూ ట్వీట్..
Samantha
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో సమంత శకుంతల పాత్రలో కనిపించగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అల్లు అర్హ కీలకపాత్రలలో నటించారు. పాన్ ఇండియా లెవల్లో ఈరోజు విడుదలైన ఈ సినిమాపై ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రివ్యూ ఇచ్చారు. అంతేకాకుండా.. శాకుంతలం విజువల్ వండర్ అని.. ఈ సినిమాను సామ్ మొత్తం తన భూజాలపై తీసుకోచ్చిందని ట్వీట్ చేసారు.

“మ్యాజికల్ విజువల్స్.. అద్భుతమైన కథనం. అన్నింటిని మించి ఇది సమంత షో. కాళిదాసు కళాఖండాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చూపించలేరు. ఈ సినిమాను సమంత తన భూజాలపై నిలబెట్టింది. మొత్తం చిత్రబృందానికి ధన్యవాదాలు. ఈ సినిమాను తప్పక చూడండి.” అంటూ ట్వీట్ చేశారు. అలాగే సమంత ఆరోగ్యంపై కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

“సామ్.. గత కొన్ని నెలలుగా మీకు ఏదీ అంత ఈజీగా లేదు. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. కానీ మీ సంకల్ప శక్తి.. పట్టుదలతో ముందుకు సాగారు. మీ అవరోధాలను అధిగమించాు. దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. బలంగా ఉండండి. మీ పోరాటాన్ని కొనసాగించండి” అంటూ ట్వీట్ చేసారు. రాజ్ అండ్ డీకే రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సామ్ కీలకపాత్ర పోషించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.