Kota Srinivasa Rao: వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..? చావు వార్తలతో పబ్లిసిటీనా సిగ్గు సిగ్గు
నటి శోభన దగ్గర నుంచి కోటా వరకు ఎంతో మందిని ఇలాంటి ఫేక్ వార్తలతో ఇబ్బందులు పెట్టారు. వాళ్లు నొచ్చుకునేలా వ్యవహరించారు. కమెడియన్ బ్రహ్మానందం, నటి అన్నపూర్ణమ్మ మీదా ఇలాంటి వార్తలే రాశారు.

మొన్న అన్నపూర్ణ్మమ్మ.. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు, గతంలోనూ ఎంతో మందిపై తప్పుడు వార్తలు. ఎంత చెప్పినా సోషల్ మీడియా బుద్ధి మారదా. ? సెలబ్రిటీలపై చావు వార్తలు పుట్టించడం.. తప్పుడు వార్తలు పుట్టించడం.. వారి ప్రైవసీకి భంగం కలిగించే వార్తలు రాయడం కొత్తేమీ కాదు. నటి శోభన దగ్గర నుంచి కోటా వరకు ఎంతో మందిని ఇలాంటి ఫేక్ వార్తలతో ఇబ్బందులు పెట్టారు. వాళ్లు నొచ్చుకునేలా వ్యవహరించారు. కమెడియన్ బ్రహ్మానందం, నటి అన్నపూర్ణమ్మ మీదా ఇలాంటి వార్తలే రాశారు. సురేఖ, సునీల్, విక్రమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని ఇలాంటి సోషల్ మీడియా వార్తలు వదల్లేదు.
కేవలం పబ్లిసిటీ కోసమే తమపై ఇలాంటివి పుట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది సెలబ్రిటీ లోకం. జీవితంలో డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా అంటూ ప్రశ్నిస్తోంది. కోట శ్రీనివాస రావు వయసు 75 ఏళ్ళు. ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి.. విలన్‌గా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో.. 750కి పైగా సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం వయసుమీద పడటంతో.. మునుపటిలా కాకుండా ఒకటీ అరా సినిమాలో నటిస్తూ.. ఎక్కువ సమయం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ నటులు వరుసగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోతున్నారు. ఇప్పుడు కోటాపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.




