AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఉగాది స్పెషల్.. నయా సినిమాల అప్డేట్స్‌తో పాటు క్రేజీ న్యూస్‌లు

విశ్వక్‌సేన్ ద్విపాత్రాభినయం చేసిన దాస్‌ కా ధమ్కీతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తండ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

Tollywood: ఉగాది స్పెషల్.. నయా సినిమాల అప్డేట్స్‌తో పాటు క్రేజీ న్యూస్‌లు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2023 | 7:47 PM

Share

ఉగాది సందర్భంగా టాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విశ్వక్‌సేన్ ద్విపాత్రాభినయం చేసిన దాస్‌ కా ధమ్కీతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తండ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్‌. తమిళ సూపర్ హిట్ వేదలంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్‌. చిరుకి జోడిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక అచ్చ తెలుగు కంటెంట్‌తో అలరిస్తున్న ఆహా మరో ఇంట్రస్టింగ్ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసురానుంది. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన న్యూస్‌ సెన్స్ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ షోలో నవదీప్‌, బిందుమాధవి లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు సాంగ్‌ వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. న్యూ జెర్సీలో ఏర్పాటు చేసిన కార్ల లైటింగ్ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్‌ చేసిన టెస్లా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి దర్శకుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

సౌత్‌ బ్లాక్ బస్టర్‌ ఆకాశం నీ హద్దురాను హిందీలో అక్షయ్‌ కుమార్ హీరోగా రీమేక్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ రీమేక్‌ను కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు.  స్టార్ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్‌ బ్యానర్‌లో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘ఆగస్టు 16, 1947. గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన మేకర్స్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఉగాది సందర్భంగా సూపర్ హిట్ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఆహా. కిరణ్ అబ్బవర్ హీరోగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణుకథ ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. కశ్మీర హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కిశోర్ అబ్బురు దర్శకుడు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించటంపై క్లారిటీ ఇచ్చారు మాళవిక మోహనన్‌. ఉస్తాద్ భగత్‌ సింగ్‌ సినిమాలో తాను నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నానని.. అదే తన టాలీవుడ్ డెబ్యూ అన్నారు మాళవిక. బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ ఇంటి ముందు ముంబై పోలీసులు భద్రత పెంచారు. అభిమానులు కూడా ఇంటి ముందు గుమి గూడకుండా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు భాయ్‌జాన్‌.

మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే