సినిమాల్లో అవకాశాల కోసం వందల మంది ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా అంటే పిచ్చితో ఊర్లనుంచి హైదరాబాద్ వచ్చి సినిమా ఆఫిసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా సినిమాల కోసం వెతికే వారిని టార్గెట్ చేసి కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసం చేస్తూ ఉంటారు. సినిమా ఛాన్స్‌ల పేరుతో డబ్బులు వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారు. ఇలా చాలా మంది సినిమా అవకాశాల పేరుతో మోసపోయారు. మరికొంతమంది ప్రముఖ సినిమా బ్యానర్స్ పేరుతో మెయిల్స్ పంపించి అవకాశాలు ఇప్పిస్తాం అంటూ ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ మెయిల్స్ పంపించారు. దీని పై అన్నపూర్ణ స్టూడియోస్ స్పందించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ సినిమా కోసం హీరో , హీరోయిన్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కావాలి అంటూ ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు సైబర్ నేరగాళ్లు. హీరోకు 20నుంచి 27 వయసు ఉండాలి, హీరోయిన్ పాత్రకు ముగ్గురు అమ్మాయిలు కావాలి.. వయసు 8 నుంచి 15 మధ్యలో ఉండాలి అంటూ అమాయకులకు వల వేసే ప్రయత్నం చేశారు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ ఖండించింది. తాము ఎలాంటి ప్రకటన చేయలేదు దయ చేసి నమ్మొద్దు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది అన్నపూర్ణ స్టూడియోస్.
దయచేసి ఇలాంటివి నమ్మకండి.. మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఎలాంటి ప్రకటనైనా మేము మా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటాము..లేదా మా వెబ్‌సైట్ ద్వారానే పంచుకుంటామని తెలిపింది. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో కొంతమంది ఇలా ఫేక్ మెయిల్స్ పంపించారు. ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కొందరు అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేశారు.
𝗔𝘁𝘁𝗲𝗻𝘁𝗶𝗼𝗻 𝗲𝘃𝗲𝗿𝘆𝗼𝗻𝗲 ⚠️
It has come to our attention that there is a fake casting call circulating for @AnnapurnaStdios. Please be aware that this is NOT legitimate and has no affiliation with team #AnnapurnaStudios.
𝐃𝐎 𝐍𝐎𝐓 provide any personal information.… pic.twitter.com/D5a3GyEJtF
— Annapurna Studios (@AnnapurnaStdios) July 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి