Fahad fazil – Nazriya Nazim: ప్రేమలు మూవీ సీన్‌కు రీల్ చేసిన ఫహద్, నజ్రియా.. ఎంత క్యూట్ గా ఉందో..
మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన మలయాళ మూవీ ప్రేమలు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ సినిమాతెలుగులో రిలీజ్ అయ్యింది ప్రేమలు సినిమా.. నేటి యువతను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
చిన్న సినిమాలు పెద్దపెద్ద విజయాలను అందుంటున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన మలయాళ మూవీ ప్రేమలు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ సినిమాతెలుగులో రిలీజ్ అయ్యింది ప్రేమలు సినిమా.. నేటి యువతను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా వీడియోలు, సీన్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాలోనూ ప్రతి సీన్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ సీన్ కు మలయాళ స్టార్ కపుల్ ఫహద్ ఫాజిల్, నజ్రియా రీల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రేమలు మూవీలోని సీన్ ను మలయాళంలో ఫహద్ ఫాజిల్, నజ్రియా రీల్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ స్టార్ కపుల్ చాలా క్యూట్ గా ఆ వీడియో చేశారు. అయితే ఈ వీడియోకు కొంతమంది నెటిజన్స్ తెలుగు వర్షన్ ను యాడ్ చేసి రీస్ షేర్ చేస్తున్నారు.దాంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఫహద్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే నజ్రియా కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.