Tollywood Drugs Case: ఎనిమిది గంటల పాటు కొసనగిన నవదీప్ విచారణ..
ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 7 వరకు ఎనిమిది గంటల పాటు సాగింది. డ్రగ్స్ కేసులో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో మీకేమైనా పరిచయాలున్నాయా.. వాళ్లతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్టు వచ్చిన అభియోగాలపై మీరేమంటారు.. కలహర్ రెడ్డి, రామ్‌చంద్‌తో జరిగిన లావాదేవీల సంగతేంటి.. మీ అకౌంట్ల వివరాలన్నీ ఇవ్వగలరా..? ఇలా నవదీప్‌ని ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది.

Navdeep
నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు హీరో నవదీప్. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 7 వరకు ఎనిమిది గంటల పాటు సాగింది. డ్రగ్స్ కేసులో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో మీకేమైనా పరిచయాలున్నాయా.. వాళ్లతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్టు వచ్చిన అభియోగాలపై మీరేమంటారు.. కలహర్ రెడ్డి, రామ్‌చంద్‌తో జరిగిన లావాదేవీల సంగతేంటి.. మీ అకౌంట్ల వివరాలన్నీ ఇవ్వగలరా..? ఇలా నవదీప్‌ని ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది.
గతంలో మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిర్మాత వెంకటరత్నారెడ్డి, రామ్‌చంద్‌లను విచారిస్తే హీరో నవదీప్ పేరు బైటికొచ్చింది. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వాంగ్మూలంలో క్లియర్‌గా చెప్పాడు రామ్‌చంద్. ఈ ఆధారంతోనే నవదీప్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసు విషయంలో సెప్టెంబర్ 23న నవదీప్‌ను విచారించారు. కొన్ని ప్రశ్నలకు నవదీప్ సరైన సమాధానాలు ఇచ్చినా మరికొన్నిటిని దాటవేశారు. నిందితుడు రామ్‌చంద్ తనకు పదేళ్ల కిందటే పరిచయమని.. ఐనా తాను ఎవరికీ డ్రగ్స్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు నవదీప్. ఇదిలా ఉంటే… 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావల్సిందిగా నోటీసులిచ్చింది ఈడీ.
మంగళవారం విచారణకొచ్చిన నవదీప్‌ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలపై కూడా ప్రశ్నించింది ఈడీ. ముఖ్యంగా నవదీప్ బ్యాంకు లావాదేవీలపై గుచ్చిగుచ్చి అడిగినట్టు తెలుస్తోంది. కానీ.. ఎనిమిది గంటలపాటు జరిగిన విచారణ తర్వాత.. చప్పుడు చెయ్యకుండా ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు నవదీప్. గతంలో నార్కొటిక్స్ అధికారుల విచారణలో నవదీప్ సహకరించలేదు. ఫార్మట్ చేసిన ఖాళీ ఫోన్‌ని అధికారుల చేతికిచ్చి.. నేనింతే.. నా దగ్గరున్న వివరాలివే అని తనదైన శైలిలో మాట్లాడారు. కానీ.. మంగళవారం నాటి ఈడీ విచారణలో మాత్రం నవదీప్ నుంచి లోతైన వివరాలు రాబట్టుకున్నట్టు, కొందరు కీలక వ్యక్తుల పేర్లు వెల్లడైనట్టు తెలుస్తోంది.
నవదీప్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.