AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? తెలిస్తే షాక్ అవవుతారు!

అమితాబ్ చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. నేడు ఈ స్టార్ యాక్టర్ పుట్టిన రోజు. నేటితో అమితాబ్ బచ్చన్ 81వ పడిలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో అమితాబ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అమితాబ్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమితాబ్ కేవలం నటుడు మాత్రమే కాదు. అతను నిర్మాత, టెలివిజన్ హోస్ట్ కూడా. కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? తెలిస్తే షాక్ అవవుతారు!
Amitabh Bachchan
Rajeev Rayala
|

Updated on: Oct 11, 2023 | 9:01 AM

Share

బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ తెలియని వాళ్ళు ఉండరు. దేశం గర్వించదగ్గ నటులలో అమితాబ్ ఒకరు. ఇప్పటికి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అమితాబ్. అమితాబ్ చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. నేడు ఈ స్టార్ యాక్టర్ పుట్టిన రోజు. నేటితో అమితాబ్ బచ్చన్ 81వ పడిలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో అమితాబ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అమితాబ్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమితాబ్ కేవలం నటుడు మాత్రమే కాదు. అతను నిర్మాత, టెలివిజన్ హోస్ట్ కూడా. కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి అందరిని మెప్పించారు అమితాబ్. అమితాబ్ అందుకున్న మొదటి జీతం ఎంతో తెలుసా..ఆయన మొదటి జీతం 500 రూపాయలు. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటున్నారు.

అమితాబ్ బచ్చన్ ఆస్తుల వివరాలు ఏంటో తెలుసా..? అమితాబ్ బచ్చన్ కార్ కలెక్షన్, నెట్ వర్త్, ప్రాపర్టీ  వివరాలు ఇవే.. అమితాబ్ బచ్చన్ 1942లో అలహాబాద్‌లో జన్మించారు. అమితాబ్ 1969లో నటించడం ప్రారంభించారు. ‘భువన్ సోమ’ ఆయన మొదటి సినిమా. ఆ తర్వాత ‘జంజీర్’, ‘రోటీ కపడా ఔర్ మకాన్’, ‘దీవార్’, ‘షోలే’ సినిమాల్లో నటించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డాన్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో ఆయన సినీ పరిశ్రమలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు . 2000లో విడుదలైన ‘మొహబ్బతే’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

అమితాబ్ బచ్చన్ మొత్తం ఆస్తుల విలువ 3,190 కోట్లు. ఆయన ఖరీదైన కార్లు, అనేక ఆస్తులు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు 6 కోట్లు తీసుకుంటున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి రూ.10 కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్ ద్వారా అందరి దృష్టినిఆకట్టుకుంటున్నారు అమితాబ్. బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.5-8 కోట్లు తీసుకుంటారు. అమితాబ్ మ్యాగీ, ఇమామీ, డాబర్ చవాన్‌ప్రాష్, డాక్టర్ ఫిక్సిట్, క్యాడ్‌బరీ, టాటా స్కై, కళ్యాణ్ జ్యువెలర్స్, ఫ్లిప్‌కార్ట్, సైకిల్ అగరాబత్తి, తనిష్క్ వంటి అనేక బ్రాండ్‌లను ప్రమోట్ చేశారు. అలాగే కౌన్ బనేగాను కరోడ్‌పతి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముంబైలో అమితాబ్ బచ్చన్‌కు ఓ ఇల్లు ఉంది. దీన్ని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ప్రతి వారాంతంలో అభిమానులను కలుస్తుంటారు. ఈ బంగ్లా విలువ 112 కోట్ల రూపాయలు.అలాగే మరికొన్ని బంగ్లాలు కూడా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.